Ads
గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు స్వర్గస్తులయ్యారు. బాలు గారి మరణం తో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో కూడా ఎంతో మంది బాధలో ఉన్నారు. ఎన్నో రంగాలకు చెందిన ప్రముఖులు కూడా బాలు గారి మరణం పై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే బాలు గారి మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. బాలు గారికి సినిమా ఇండస్ట్రీలో, అలాగే బయట కూడా ఎంతో మంది మిత్రులు ఉన్నారు.
Video Advertisement
సినిమా ఇండస్ట్రీలో బాలు గారికి ఉన్న సన్నిహితుల లో రచయిత వేటూరి సుందరరామ మూర్తి గారు ఒకరు. వేటూరి గారు జనవరి 29 వ తేదీన, 1936 లో జన్మించారు. వేటూరి గారి సాహిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఎన్నో అద్భుతమైన పాటలకు అంతే అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు వేటూరి గారు. సినిమా సాహిత్య రంగంలో ఆయన చేసిన కృషికి ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకోవడంతో పాటు, ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు వేటూరి గారు.
మే 22వ తేదీ 2010 లో వేటూరి గారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఇది మరి ఎలా జరిగిందో, ఈ సంఘటనని ఏమని పిలవాలో తెలియదు గానీ, ఒకసారి గమనిస్తే వేటూరి గారు, బాలు గారు జీవించిన రోజుల సంఖ్య ఒకటే. వేటూరి గారు జనవరి 29వ తేదీ 1936 లో పుట్టారు, మే 22వ తేదీ 2010 లో మరణించారు. అంటే 74 సంవత్సరాల 114 రోజులు జీవించారు. ఒకవేళ రోజులుగా చూసుకుంటే 27,143 రోజులు.
బాలు గారు జూన్ 4 వ తేదీ, 1946లో జన్మించారు. సెప్టెంబర్ 25 వ తేదీ, 2020లో మరణించారు. బాలు గారు చనిపోయే సమయానికి ఆయన వయసు 74 సంవత్సరాల 114 రోజులు. అంటే బాలు గారు 27,143 రోజులు జీవించారు. ఈ సంఘటనకి కోఇన్సిడెన్స్ లాంటి పదాలు వాడడం తప్పు. అది ఒక్కటే కాదు ఏ పేరుతో పెట్టినా కూడా తప్పుగానే అర్థం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ముందే ఈ సంఘటనని ఏమని పిలవాలో తెలియదు అని చెప్పి, కేవలం విషయం గురించి మాత్రమే మాట్లాడుకున్నాం.
End of Article