Ads
ఐపీఎల్ మొదలవడం ఒక ఎత్తయితే మొదలయ్యే ముందు జరిగిన చర్చలు మరొక ఎత్తు. అసలు ఈసారి ఐపీఎల్ ఉంటుందా? లేదా? ఒకవేళ ఉంటే స్టేడియం కి వెళ్లి ఆట చూసే అవకాశం ఉంటుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉండేవి. అలాంటి సమయంలో ఐపీఎల్ మొదలవుతుంది అని అనౌన్స్ చేశారు. దాంతో క్రికెట్ అభిమానులు అందరిలో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. కానీ మళ్లీ ఐపీఎల్ స్పాన్సర్స్ విషయంలో ఎంతో డిస్కషన్ జరిగింది. ముందు పతంజలి వాళ్ళు ఐపీఎల్ స్పాన్సర్ చేస్తారు అని అన్నారు. తర్వాత డ్రీం లెవెన్ వాళ్ళు రంగం లోకి అడుగుపెట్టారు. ఏదైతేనేం ఐపీఎల్ అయితే మొదలైంది.
Video Advertisement
ఐపీఎల్ మొదలైంది అంటే క్రికెట్ సీజన్ మాత్రమే కాకుండా దానితో పాటు బెట్టింగ్స్ కూడా మొదలవుతాయి. డ్రీం 11. దీని గురించి పరిచయం అసలు అవసరం లేదు. ఇప్పటికే డ్రీం 11 చాలా ప్రదేశాల్లో బ్యాన్ అయ్యింది. ఇప్పుడు ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా చేరింది. డ్రీం 11 ఆంధ్రప్రదేశ్ లో బ్యాన్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో డ్రీం లెవెన్ బ్యాన్ చేయడంతో అందరూ ఒక రకంగా షాక్ లో ఉన్నారు అనే చెప్పాలి. తెలంగాణ లో డ్రీం 11 ఎప్పుడో బ్యాన్ అయింది అనుకోండి. అది వేరే విషయం.
డ్రీం 11 లో కేవలం క్రికెట్ మాత్రమే కాదు ఇతర ఆటలు కూడా ఆడుతారు. అసలు ఐపీఎల్ 2020 మొదలైనప్పటి నుంచి డ్రీం లెవెన్ ఆంధ్రప్రదేశ్ లో బ్యాన్ అవుతుంది అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అదే నిజమైంది. అసలు ఈ వార్త మర్చిపోయి ఇంక బ్యాన్ ఏమీ ఉండదు ఏమో అనుకునే టైంలో సడన్ గా ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. దీంతో సోషల్ మీడియా లో మీమ్ పేజెస్ ఆంధ్రప్రదేశ్ లో డ్రీం 11 బ్యాన్ అవ్వడం అనే షాకింగ్ న్యూస్ విని నిజంగానే ఎంత షాక్ అయ్యారో మీమ్స్ రూపంలో పోస్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో డ్రీం 11 బ్యాన్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3 #4 #5 #6 #7 #8#9
#10
గతంలో యువతను తప్పుదారి పట్టిస్తున్నాయి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అంటే ఆన్లైన్ లో ఆడే రమ్మీ, పోకర్ లను బ్యాన్ చేసింది. ఒకవేళ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కి పాల్పడితే జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని అలాగే పెనాల్టీ కూడా కట్టాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు.
End of Article