Ads
మధురైలో ఘటన చోటు చేసుకుంది. వన్ ఇండియా తెలుగు కథనం ప్రకారం తమిళనాడులోని మదురై జిల్లా లోని పెరుంగుడి ప్రాంతానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి కనిమొళి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. వాళ్ళిద్దరికీ పెళ్లి అయ్యి రెండు సంవత్సరాలు అయినా కానీ పిల్లలు లేరట. దాంతో రాజేష్ ని విడాకులు తీసుకోమని తన కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారట. కానీ రాజేష్ విడాకులు తీసుకోవడానికి అంగీకరించలేదట.
Video Advertisement
దాంతో ఇద్దరు డాక్టర్ ని ఆశ్రయించారట. డాక్టర్ కనిమొళి గర్భాశయం లో నీళ్ళు ఉన్నాయని, అలాగే కొంచెం బరువు ఉన్నారు కాబట్టి పిల్లలు పుట్టడం ఆలస్యం అయ్యే సమస్య వచ్చిందని చెప్పారట. దాంతో కనిమొళి బరువు తగ్గాలని జిమ్ లో జాయిన్ అయ్యారట. జిమ్ ట్రైనర్ యోగేష్ కన్నా కనిమొళికి ఫ్రెండ్ అయ్యారట. తర్వాత ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారట.
కనిమొళి ప్రవర్తన వేరేగా ఉండడంతో రాజేష్ అసలు విషయం ఏంటి అని ఆరా తీస్తే, ఈ విషయమంతా తెలిసిందట. దాంతో రాజేష్ కనిమొళిని జిమ్ కి వెళ్ళనివ్వలేదట. కనిమొళి యోగేష్ కన్నా కి ఫోన్ చేసి ఈ విషయం అంతా చెప్పారట. దాంతో యోగేష్ కన్నా రాజేష్, కనిమొళి వాళ్ళ ఇంటికి వచ్చి రాజేష్ ని చంపేస్తామని బెదిరించారట. యోగేష్ కన్నా, కనిమొళి వెళ్లిపోయారట. తర్వాత రాజేష్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారట. పోలీసులు రాజేష్, కనిమొళి, యోగేష్ కన్నా లని స్టేషన్ కి పిలిపించారట. రాజేష్ కేసు పెట్టడంతో కనిమొళి, యోగేష్ కన్నా ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారట.
End of Article