Ads
లాక్ డౌన్ రూల్స్ కొంచెం మార్చడంతో చాలా వరకు వ్యాపారాలు మొదలయ్యాయి. ఎన్నో నెలలుగా ఆగిపోయిన షూటింగ్స్ కూడా సోషల్ డిస్టెన్స్ తో జరుగుతున్నాయి. అలా షూటింగ్ దాదాపు అయిపోవడానికి వచ్చి లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఎన్నో సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాయి. అంతే కాకుండా కొన్ని కొత్త సినిమాల షూటింగ్స్ కూడా మొదలయ్యాయి. అలా తన రాబోయే సినిమా కోసం షూటింగ్ కి వెళుతూ ఒక హీరోయిన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ ఫోటో పోస్ట్ చేశారు.
Video Advertisement
ఈ హీరోయిన్ ఎవరో ఈపాటికే మీలో చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. ఇలా ఇన్ని జాగ్రత్తలతో షూటింగ్ కి బయలుదేరిన హీరోయిన్ మరెవరో కాదు మీనా. తెలుగు లోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఎన్నో సినిమాల్లో నటించారు మీనా. 2018 లో వచ్చిన సాక్ష్యం సినిమాలో కూడా నటించారు మీనా.
మీనా దృశ్యం టు సినిమా షూటింగ్ కి వెళుతున్నప్పుడు దిగి పోస్ట్ చేసిన ఫోటో ఇది. దృశ్యం అంటే తెలుగు దృశ్యం కాదు. మలయాళం సినిమా. నిజానికి దృశ్యం మొదట మలయాళంలో విడుదలైంది. ఈ సినిమాలో మోహన్ లాల్ హీరోగా నటించారు. మీనా హీరోయిన్ గా నటించారు. తర్వాత ఇదే సినిమా కన్నడ (దృశ్య), తెలుగు (దృశ్యం), తమిళ్ (పాపనాశం), హిందీ (దృశ్యం) లో కూడా రీమేక్ అయ్యింది. అయితే ప్రస్తుతం మలయాళంలో ఈ సినిమా పార్ట్ 2 మొదలైంది. ఇందులో కూడా మోహన్ లాల్ హీరోగా, మీనా హీరోయిన్ గా నటిస్తున్నారు.
End of Article