బిగ్ బాస్ 3 డబ్బులే ఇంకా ఇవ్వలేదు.! హీరోయిన్ సంచలన కామెంట్స్.!

బిగ్ బాస్ 3 డబ్బులే ఇంకా ఇవ్వలేదు.! హీరోయిన్ సంచలన కామెంట్స్.!

by Mohana Priya

Ads

టీవీ షోస్ లో, ముఖ్యంగా రియాలిటీ షోస్ లో గొడవలు అనేవి అవుతూనే ఉంటాయి. కొన్ని షోస్ లో జడ్జెస్ కి, కంటెస్టెంట్స్ కి మధ్య గొడవలు అవుతాయి. ఇంకొన్ని షోస్ లో తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన వాళ్లు మాటల మధ్యలో గొడవలు పడుతుంటారు. ఇవన్నీ మనం కూడా పెద్దగా పట్టించుకోము. కానీ బిగ్ బాస్ షో మాత్రం ఇందుకు కొంచెం డిఫరెంట్. అసలు బిగ్ బాస్ షో అంటేనే గొడవలకి కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు.కంటెస్టెంట్స్ గొడవపడితే తర్వాత సోషల్ మీడియాలో దాని గురించి ఎంత చర్చ జరుగుతుందో అందరికీ తెలుసు.

Video Advertisement

అయితే షోలో మాత్రమే కాకుండా షో తర్వాత కూడా బిగ్ బాస్ కి సంబంధించిన విషయాలు చర్చలోకి వస్తూనే ఉంటాయి.అలాగే బిగ్ బాస్ కి సంబంధించిన మరొక విషయం కూడా ప్రస్తుతం చర్చలో ఉంది. బిగ్ బాస్ తమిళ్ లో కూడా వస్తుంది అనే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది.

ఆ షోకి కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తారు. బిగ్ బాస్ సీజన్ త్రీ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో నటి కస్తూరి కూడా ఉన్నారు. కస్తూరి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం లో ఎన్నో సినిమాలు చేశారు. బిగ్ బాస్ తమిళ్ సీజన్ త్రీ లో కస్తూరి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. అయితే ఇటీవల బిగ్ బాస్ కి సంబంధించి కస్తూరి చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ట్వీట్ లో కస్తూరి బిగ్ బాస్ షో లో పాల్గొని దాదాపు సంవత్సరం అవుతున్నా తన రెమ్యూనరేషన్ ఇంకా ఇవ్వలేదు అని, తనకి రావాల్సిన పారితోషకాన్ని నిలిపివేసేందుకు విజయ్ టీవీ కి థాంక్స్ ఎలా చెప్పాలో మాటలు రావట్లేదు అని, కొంతమంది పిల్లల ఆపరేషన్ ఖర్చు కోసం షో లో పాల్గొన్నాను అని, వాళ్లు (ఛానల్ యాజమాన్యం) చేసిన తప్పుడు ప్రామిస్ లని తను ఎప్పుడూ నమ్మలేదు అని, కానీ ఇలా చేస్తారు అని అస్సలు ఊహించలేదు అని పేర్కొన్నారు.


End of Article

You may also like