బిగ్ బాస్ 4 ఫేమ్ “స్వాతి దీక్షిత్” గురించి ఈ విషయాలు తెలుసా.? బ్యాక్గ్రౌండ్ ఏంటంటే?

బిగ్ బాస్ 4 ఫేమ్ “స్వాతి దీక్షిత్” గురించి ఈ విషయాలు తెలుసా.? బ్యాక్గ్రౌండ్ ఏంటంటే?

by Mohana Priya

Ads

బిగ్ బాస్ సీజన్ 4 మూడు వారాలు కంప్లీట్ అయ్యాయి. మొదటి రెండు వారాల తో పోలిస్తే మూడో వారంలో టాస్క్ లు, గొడవలు కూడా కొంచెం ఎక్కువగానే జరిగాయి. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ లో మోనాల్ గజ్జర్, అభిజిత్, మెహబూబ్, అఖిల్ సార్థక్, గంగవ్వ, సయ్యద్ సోహెల్ రయాన్, కరాటే కళ్యాణి, అరియానా గ్లోరీ, లాస్య, దివి, అలేఖ్య హారిక, నోయల్, జోర్దార్ సుజాత, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి, సూర్య కిరణ్ కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. అంతేకాకుండా ఈ రోజుల్లో, బస్టాప్, బ్రాండ్ బాబు సినిమాల్లో నటించిన కుమార్ సాయి, జబర్దస్త్ ఫేమ్ అవినాష్, జంప్ జిలాని ఫేమ్ స్వాతి దీక్షిత్ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు.

Video Advertisement

స్వాతి దీక్షిత్ 2009లో అందమైన భామలు అనే టీవీ షో తో తన కెరీర్ ని మొదలు పెట్టారు. ఆ షోలో టైటిల్ కూడా గెలుచుకున్నారు స్వాతి దీక్షిత్. తర్వాత కొన్ని అడ్వటైజ్మెంట్స్ లో చేయడంతోపాటు చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు.

2012 లో తోర్ నామ్ అనే బెంగాలీ సినిమాలో హీరోయిన్ గా నటించారు స్వాతి దీక్షిత్. ఈ సినిమా కొత్త బంగారు లోకం సినిమా కి రీమేక్.

తర్వాత బ్రేకప్ అనే తెలుగు సినిమాలో నటించారు. రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన పట్టపగలు అనే సినిమాలో నటించారు స్వాతి దీక్షిత్ కానీ ఆ సినిమా విడుదల అవ్వలేదు.

2014లో అల్లరి నరేష్ డబుల్ యాక్షన్ చేసిన సినిమా జంప్ జిలాని లో ఒక అల్లరి నరేష్ క్యారెక్టర్ కి జోడీగా నటించారు స్వాతి దీక్షిత్. లేడీస్ అండ్ జెంటిల్ మెన్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో స్వాతి దీక్షిత్ ది కొంచెం నెగటివ్ షేడ్స్ ఉండే పాత్ర.

2017 లో అంజలి హీరోయిన్ గా నటించిన చిత్రాంగద సినిమాలో ఒక పాత్ర పోషించారు స్వాతి దీక్షిత్. అదే సంవత్సరం లో తమిళ్ లో సతుర అడి 3500 అనే సినిమాలో నటించారు. 2019 లో ఇంకొక తమిళ్ సినిమా సింబా లో నటించారు.

స్వాతి దీక్షిత్ ని గతంలో రెండు సార్లు బిగ్ బాస్ టీం సంప్రదించారట. కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు బిగ్ బాస్ షో కి రాలేకపోయారట స్వాతి దీక్షిత్. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్ తాజాగా ఎలిమినేట్ కూడా అయ్యారు.


End of Article

You may also like