Ads
తమిళనాడులో ఏఐఏడీఎంకే కల్లకురిచి ఎమ్మెల్యే ప్రభు వివాహం ప్రస్తుతం ఎన్నో చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే ద ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం 36 ఏళ్ల ప్రభు దాదాపు నాలుగు సంవత్సరాల నుండి 19 సంవత్సరాల సౌందర్య తో ప్రేమలో ఉన్నారట. అయితే ఇద్దరి కులాలు వేరే అట. సోమవారం ఉదయం తన నివాసం వద్ద ప్రభు సౌందర్య ని పెళ్లి చేసుకున్నారు. సౌందర్య తండ్రి ఒక ఆలయ పూజారి అట. ఆయనకు ఈ పెళ్లి ఇష్టం లేదట.
Video Advertisement
దాంతో ఈ పెళ్ళికి అంగీకరించని సౌందర్య తండ్రి, ప్రభు నివాసంలోకి వెళ్లడానికి ప్రయత్నించి, ఆత్మహత్యాయత్నం చేశారట. ఈ విషయంపై సీనియర్ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ “వాళ్ళిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు అనేది నిజమేనని, అమ్మాయి తల్లిదండ్రులు ప్రభు ఇంకా ఆ అమ్మాయి నాలుగేళ్ల నుండి ప్రేమించుకుంటున్నారని చెప్పారని, అప్పుడు సౌందర్య మైనర్ అని అన్నారు” అని చెప్పారు.
సౌందర్య తండ్రి మాట్లాడుతూ ప్రభు వాళ్ళింట్లో ఎన్నో సంవత్సరాలు ఉన్నాడు అని, ప్రభుని వాళ్లు తమ కొడుకు లాగా భావించాము అని, ప్రభు తన నమ్మకాన్ని పోగొట్టాడు అని, తన కూతురు పెళ్ళికి ఇంకా సిద్ధంగా లేదు అని, ఇద్దరికీ మధ్య 17 సంవత్సరాల తేడా ఉంది అని అన్నారు.
ప్రభు సౌందర్య తో కలిసి ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో తాము నాలుగు నెలల నుండి ప్రేమలో ఉన్నాము అని, పెళ్లికి సౌందర్య తల్లిదండ్రుల నుంచి అనుమతి అడిగారు అని కానీ వాళ్ళు అంగీకరించలేదని, జరిగే పరిణామాలు అన్నిటినీ అధికారికంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
End of Article