Ads
ఐపీఎల్ 2020 లో నిన్న ఢిల్లీ కాపిటల్స్ జట్టు కి రాజస్థాన్ రాయల్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 46 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దాంతో శిఖర్ ధావన్ (5: 4 బంతుల్లో 1×4) తో కలిసి పృథ్వీ షా (19: 10 బంతుల్లో 2×4, 1×6) తో ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. రెండో ఓవర్ లో శిఖర్ ధావన్, నాలుగవ ఓవర్ లో పృథ్వీ షా అవుటయ్యారు. తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (22: 18 బంతుల్లో 4×4) లేని రన్ కోసం ప్రయత్నిస్తూ రనౌట్ అయ్యారు.
Video Advertisement
రిషబ్ పంత్ (5: 9 బంతుల్లో) స్కోర్ చేశారు. బాల్ చూసుకోకుండా సింగిల్ కోసం వెళ్ళి రిషబ్ పంత్ అవుటయ్యారు. షిమ్రోన్ హెట్మెయర్ (45: 24 బంతుల్లో 1×4, 5×6), మార్కస్ స్టాయినిస్ (39: 30 బంతుల్లో 4×6) స్కోర్ చేశారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు, కార్తీక్ త్యాగీ ఒక వికెట్, ఆండ్రూ టై ఒక వికెట్, రాహుల్ తెవాటియా ఒక వికెట్ పడగొట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 184 పరుగుల స్కోర్ చేసింది.రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓపెనర్ జోస్ బట్లర్ (13: 8 బంతుల్లో 2×4), కెప్టెన్ స్టీవ్‌స్మిత్ (24: 17 బంతుల్లో 2×4, 1×6), సంజు శాంసన్ (5: 9 బంతుల్లో), మహిపాల్ (1) స్కోర్ చేశారు. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (34: 36 బంతుల్లో 1×4, 2×6) చేయగా, రాహుల్ తెవాటియా (38: 29 బంతుల్లో 3×4, 2×6) చేశారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 138 పరుగుల స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2 #3 #4 #5 #6 #7
#8 #9 #10
#11 #12
#12
#13
#14
#15
End of Article