స్క్రాచ్ కార్డ్ తో కొత్త రకం మోసం (వీడియో)….. క్లిక్ చేస్తే…..మీ ఖాతా కాళీనే.

స్క్రాచ్ కార్డ్ తో కొత్త రకం మోసం (వీడియో)….. క్లిక్ చేస్తే…..మీ ఖాతా కాళీనే.

by Mohana Priya

Ads

ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా డబ్బులు కరెన్సీ రూపంలో చెల్లించడం కంటే ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం ప్రిఫర్ చేస్తున్నాము. అలా మనం యాప్ ద్వారా డబ్బులు చెల్లించిన ప్రతి సారి మనకి స్క్రాచ్ కార్డ్  ద్వారా డబ్బులు లేదా ఏదైనా ఆఫర్ వస్తుంది. ఇలా అయితే పర్వాలేదు. కానీ మనలో చాలా మంది అవసరం ఉన్నా లేకపోయినా కేవలం డబ్బులు చెల్లించిన తర్వాత వచ్చే స్క్రాచ్ కార్డ్ ద్వారా లభించే డబ్బులు లేదా ఆఫర్స్  కోసం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం.

Video Advertisement

దీనిని కొంతమంది అలుసుగా తీసుకొని సైబర్ క్రైమ్ కి పాల్పడతారు అని పోలీసులు అంటున్నారు. యూపీఐ ఆధారిత సర్వీసులను వినియోగించుకోవాలని, మన ఫోన్ కి ఒక స్క్రాచ్ కార్డ్ పంపుతారు. ఆ స్క్రాచ్ కార్డ్ ని స్క్రాచ్ చేస్తే డబ్బులు లేదా ఆఫర్ కూపన్ వస్తుంది అని మెన్షన్ చేస్తారు.

ఒకవేళ మనం మన ఫోన్ కి వచ్చిన స్క్రాచ్ కార్డ్ ని స్క్రాచ్ చేస్తే మన అకౌంట్ లో ఉన్న డబ్బులు అన్నీ వాళ్ళ అకౌంట్,  అంటే మనకి మెసేజ్ పంపించిన సైబర్ క్రైమ్ నేరస్తుల అకౌంట్ లోకి వెళ్లి పోతాయట. వీళ్ళని పట్టుకోవడం కూడా చాలా కష్టం అట. కాబట్టి ఇలాంటి స్క్రాచ్ కార్డ్ లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెప్తున్నారు.


End of Article

You may also like