Ads
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా ఇద్దరమ్మాయిలతో. ఈ సినిమాలో అమలా పాల్, కేథరీన్ హీరోయిన్స్ గా నటించారు. ఇద్దరమ్మాయిలతో సినిమా వచ్చి దాదాపు ఏడు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి ఈ సినిమా సాంగ్స్ చాలా చోట్ల వినపడతాయి. అంత బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చారు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.
Video Advertisement
మనం బహుశా సినిమా చూసినప్పుడు గమనించలేదు కానీ, ఈ సినిమాలో ఒక పొరపాటు ఉంది. అంటే కథ పరంగా కాదు, ఒక సీన్ లో ఒక పొరపాటు ఉంది. అదేంటంటే. అల్లు అర్జున్, అమలా పాల్ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడతారు. వాళ్లు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నట్టు అల్లు అర్జున్ పేరెంట్స్ కి, అమలా పాల్ పేరెంట్స్ కి స్కైప్ ద్వారా చెప్తారు.
“ఇందులో పొరపాటు ఏముంది?” అనుకోకండి. ఒకసారి పైన ఉన్న ఫోటో ని అబ్జర్వ్ చేయండి. స్కైప్ కాల్ లో కింద మైక్ సింబల్ ఆఫ్ చేసి ఉంది. అంటే మైక్ ఆఫ్ చేసి ఉన్నప్పుడు మనం మాట్లాడేది అవతల వాళ్ళకి వినిపించదు. కానీ ఈ సీన్ లో మాత్రం వీడియో కాల్ లో మాట్లాడే మాటలు అందరికీ క్లియర్ గానే వినిపిస్తాయి.
అంటే దీని వల్ల సినిమాకి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వలేదు అనుకోండి. కానీ ఎప్పుడైనా మనం సినిమా చూసినప్పుడు “ఇది పొరపాటు కదా? మామూలుగా అయితే ఇలా ఉండదు కదా?” అని అనిపిస్తుంది అంతే. ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మించారు. ఇద్దరమ్మాయిలతో సినిమాలోని టాప్ లేచిపోద్ది సాంగ్ కేవలం మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నేషనల్ వైడ్ గా ఎంతో పాపులర్ అయింది. అల్లు అర్జున్ డాన్స్ చూసి ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా చాలా అప్రిషియేట్ చేశారు.
బ్రహ్మానందం గారికి, అలీ కి మధ్య వచ్చే సీన్స్ కూడా ఈ సినిమాకి హైలెట్ గా నిలిచాయి. వీటితో పాటు డైలాగ్స్, యాక్షన్ సీన్స్ కూడా మరో ప్లస్ పాయింట్ అయ్యాయి. అల్లు అర్జున్ కూడా ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపిస్తారు. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి, సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా, ఇప్పటికీ ఈ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
End of Article