Ads
ఏదైనా రంగంలో పుకార్లు అనేవి చాలా సాధారణం. అందులోనూ ఇంకా సినిమా ఇండస్ట్రీలో అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. రోజుకి ఒక కొత్త రూమర్ వస్తూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా కొన్ని పుకార్లకి మాత్రమే స్పందిస్తారు. కొన్నిటిపై మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు. సెలబ్రిటీలపై వచ్చే రూమర్స్ లో రిలేషన్ షిప్ గురించి రూమర్స్ ఎక్కువగా వస్తాయి. అలా తమ రిలేషన్ షిప్ గురించి రూమర్స్ వచ్చిన కొంత మంది సెలబ్రెటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 తరుణ్ – ఆర్తి అగర్వాల్
నువ్వు లేక నేను లేను, ఇంకా సోగ్గాడు సినిమాలలో కలిసి నటించిన ఆర్తి అగర్వాల్, తరుణ్ రిలేషన్ షిప్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.
#2 శింబు – నయనతార
వల్లభ సినిమా టైంలో వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు అని వార్తలు వచ్చాయి. కానీ తర్వాత ఇద్దరూ విడిపోయారు అని అన్నారు. కానీ ఇన్ని సంవత్సరాలు అయినా కూడా శింబు కానీ, నయనతార కానీ ఈ విషయం గురించి పెద్దగా స్పందించలేదు.
#3 రానా – త్రిష
రానా ఇంకా త్రిష ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు అని, పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు వచ్చాయి. కానీ వీళ్లిద్దరు మాత్రం వాళ్లు చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్పారు.
#4 అనిరుధ్ రవిచందర్ – ఆండ్రియా
వీళ్ళిద్దరూ సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోస్ లీక్ అయ్యి ఎన్నో వివాదాలకు దారి తీశాయి.
#5 రాజ్ తరుణ్ – హెబ్బా పటేల్
కుమారి 21ఎఫ్, ఈడోరకం ఆడోరకం, అంధగాడు, సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. అలాగే నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ సినిమా లో రాజ్ తరుణ్, ఒరేయ్ బుజ్జిగా సినిమా లో హెబ్బా పటేల్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. వీరిద్దరి రిలేషన్ షిప్ గురించి గత కొంతకాలంగా రూమర్స్ వస్తున్నాయి.
#6 సుధీర్ – రష్మీ
తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో ఆన్ స్క్రీన్ లో మోస్ట్ పాపులర్ కపుల్స్ లో సుధీర్, రష్మీ ఒకరు. వీళ్ళిద్దరి రిలేషన్ షిప్ గురించి ఎన్ని వార్తలు వచ్చినా కూడా సుధీర్, రష్మీ మాత్రం వాళ్లు చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్తారు.
#7 ప్రభాస్ – అనుష్క
ప్రభాస్ అనుష్క కూడా ఎన్నో సంవత్సరాల నుండి వారి ఇద్దరికీ పరిచయం ఉంది అని, వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్తారు.
#8 హైపర్ ఆది – వర్షిణి
ఢీ జోడి ప్రోగ్రాం తర్వాత నుండి వీళ్లిద్దరి గురించి పుకార్లు రావడం మొదలయ్యాయి.
#9 సిద్దార్థ్ – సమంత
జబర్దస్త్ సినిమా సమయంలో వీళ్ళిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని, తర్వాత వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు అని వార్తలు వచ్చాయి.
#10 బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ అగర్వాల్
కవచం సినిమా సమయంలో ఈ పుకార్లు మొదలయ్యాయి. తర్వాత వీరిద్దరూ కలిసి సీత సినిమాలో కూడా యాక్ట్ చేశారు.
#11 రవి – శ్రీముఖి
ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయ్యే సూపర్ హిట్ షో పటాస్ లో వీళ్ళిద్దరూ కలిసి యాంకరింగ్ చేసే వాళ్ళు. దాంతో వీళ్లిద్దరిపై రూమర్స్ వచ్చాయి. కానీ తర్వాత వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని అన్నారు. రవి కూడా తనకు ముందే పెళ్లి అయింది అని అన్నారు.
End of Article