Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో మైలు రాయిగా నిలిచిన చిత్రం ఖుషి గురించి తాజాగా ఒక ఆసక్తికర అంశం బయటకు వచ్చింది.ఇప్పుడు ఆ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది.ఇంతకీ విషయమేంటంటే ఎస్.జే సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ భూమిక జంటగా నటించిన చిత్రం ఖుషి. ఈ చిత్రంలోని అన్ని సన్నివేశాలు చాలా కొత్తగా మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి.అందుకే ఈ చిత్రాన్ని సినీ ప్రేక్షకుల బాగా ఆదరించారు.దానితో ఈ చిత్రం అప్పటి టాలీవుడ్ రికార్డులన్నిటిని బ్రేక్ చేసి ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది.
Video Advertisement
ఈ చిత్రంలో పవన్ భూమిక నడుము చూసే సీన్ బాగా క్లిక్ అయ్యింది.ఆ సీన్ కి క్రేజ్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు.అందుకే టాలీవుడ్ యంగ్ హీరోలందరూ తమ చిత్రాలలో ఈ సీన్ ను ఇప్పటికీ ఉపయోగిస్తుంటారు.ఆ సీన్ లో పవన్ పలికించిన హావభావాలు అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసింది.ఆ సీన్ తెరకెక్కించే సమయంలో దర్శకుడు ఎస్.జే సూర్య ముందుగా పవన్ ను ఓ బల్ల మీద కూర్చోబెట్టి ఆయన భూమిక నడుమును చూస్తున్నట్లు హావభావాలు ఇవ్వవలసిందిగా కోరాడట.
దర్శకుడు కోరిక మేర పవన్ అలా భూమిక నడుము చూస్తున్నట్లు ఇచ్చిన హావభావాలే మనకు ఖుషి చిత్రంలో కనిపిస్తాయి.పవన్ సన్నివేశం పూర్తయ్యాక దర్శకుడు భూమిక నడుము సీన్స్ ను సెపరేట్ గా తీసుకొని వాటిని తర్వాత చిత్రంలో కలిపారు. దర్శకుడు ఎస్.జే సూర్య టాలెంట్ కు ఇది ఒక తార్కాణం.ఇలాంటి ఎన్నో అద్భుతాలను ఆయన తెరకెక్కించి సినీ అభిమానుల మనసులను కొల్లగొట్టారు.
ఈయన టాలెంట్ కు సినీ అభిమానులే కాదు పవర్ స్టార్ కూడా ఫిదా అయ్యారు.అందుకే ఆయన ఎస్.జే సూర్య దర్శకత్వం వహించిన పులి చిత్రంలో నటించారు.ఇది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం పవన్ పింక్ తెలుగు రీమేక్ వకిల్ సాబ్ లో బిజీగా ఉన్నాడు.ఇక దర్శకుడు ఎస్.జే.సూర్య కూడా తన తదుపరి చిత్రాలతో బాగా బిజీగా అయిపోయారు.
End of Article