Ads
జమ్ము కాశ్మీర్ లో టెర్రరిస్టులతో ప్రాణాలకు తెగించి పోరాడి వీర మరణం పొందారు హవల్దార్ ప్రవీణ్ కుమార్ రెడ్డి. ప్రవీణ్ కుమార్ చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లి కి చెందినవారు. ప్రవీణ్ కుమార్ దాదాపు 17 ఏళ్లుగా ఆర్మీలో ఉన్నారు. 13 సంవత్సరాల పాటు కాశ్మీర్ లో పని చేశారు.
Video Advertisement
మూడేళ్ల పాటు NSG నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ లో కమాండో గా సేవలను అందించారు. ప్రవీణ్ కుమార్ పూంచ్ సెక్టార్ బెటాలిక్ లో కూడా పని చేశారు. సిపాయిగా ఆర్మీలో చేరి తర్వాత హవల్దార్ స్థాయికి ఎదిగారు.
18 మద్రాస్ ఇంఫెంట్రీ విభాగంలో హవల్దార్ గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ కుమార్ కి పది సంవత్సరాల క్రితం రజిత తో పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరికి ఎనిమిది సంవత్సరాల వయసు, ఇంకొకరికి ఐదు సంవత్సరాల వయసు.
source : tv9
ప్రవీణ్ కుమార్ నిన్న ఉదయం, అంటే ఆదివారం ఉదయం తన భార్య రజితకి ఫోన్ చేశారు. తాను టెర్రరిస్టులతో జరిగే ఆపరేషన్ లో పాల్గొనబోతున్నట్టు రజితతో చెప్పారు ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ కుమార్ మరణవార్త విన్న భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. ప్రవీణ్ కుమార్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
source :
https://www.thenewsminute.com/article/army-soldier-killed-jk-terror-op-hailed-telangana-married-only-year-ago-137210
End of Article