Ads
ఎన్నో సినిమాల్లో నటించి తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ద్వారా మనందరికీ ఇంకా సుపరిచితులు అయ్యారు పూజా రామచంద్రన్. తనకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు ఒక ఎడ్వర్టైజ్మెంట్ లో నటించారు పూజ.
Video Advertisement
తర్వాత ఒక మలయాళ సినిమాలో ఒక చిన్న పాత్ర చేశారు. 2006 లో SS మ్యూజిక్ ఛానల్ లో వీజే గా చేశారు. తర్వాత ఎన్నో ప్రోగ్రామ్స్ హోస్ట్ చేశారు. 2012 లో లవ్ ఫెయిల్యూర్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.
తర్వాత తమిళ్, మలయాళం సినిమాలతో పాటు తెలుగులో స్వామి రారా, అడవి కాచిన వెన్నెల, దోచేయ్, త్రిపుర, దళం, సిద్ధార్థ, ఎంత మంచి వాడవురా, ఇంకా కొన్ని సినిమాల్లో నటించారు. 2018 లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు పూజ.
పూజ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది కొన్ని వారాలే అయినా కూడా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, టాస్క్స్ కూడా బాగా ఆడడంతో ప్రేక్షకుల్లో బాగా రిజిస్టర్ అయ్యారు. 2010 లో పూజ, వీజే క్రెయిగ్ ను పెళ్లి చేసుకున్నారు. 2017 లో వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు.
15 ఏప్రిల్ 2019 న నటుడు జాన్ కొక్కెన్ ను పెళ్లి చేసుకున్నారు పూజ. 2012 లో జాన్ కొక్కెన్, నటి మీరా వాసుదేవన్ పెళ్లి చేసుకున్నారు. 2016 లో వాళ్ళిద్దరూ విడిపోయారు. జాన్ కొక్కెన్ జనతా గ్యారేజ్ , సర్దార్ గబ్బర్ సింగ్, కేజిఎఫ్, బాహుబలి ద బిగినింగ్, 1 నేనొక్కడినే సినిమాల్లో నటించారు. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో కూడా నటించారు.
End of Article