Ads
మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో అమెజాన్ ప్రైమ్ మరొక హిట్ కొట్టింది. నవంబర్ 20 వ తేదీన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలయింది. ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, సినిమా చాలా నాచురల్ గా ఉంది. పాత్రలు కూడా అంతే నాచురల్ గా ఉన్నాయి. అసలు ఈ సినిమాకి పెద్ద హైలెట్ హీరో తండ్రి కొండల్ రావు పాత్ర. ఈ పాత్రకి చాలా మంది రిలేట్ అయ్యారు. ఈ పాత్రని పోషించిన యాక్టర్ గోపరాజు రమణ.
Video Advertisement
గోపరాజు రమణ ఒక థియేటర్ ఆర్టిస్ట్. 25 సంవత్సరాలుగా సినిమా రంగంలో, టెలివిజన్ రంగంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు గోపరాజు రమణ. గోపరాజు రమణ మొదటి సారిగా గ్రహణం సినిమాలో నటించారు. ఆ తర్వాత అష్టా చమ్మా, మాయాబజార్, గోల్కొండ హై స్కూల్ సినిమాల్లో నటించారు.
అంతే కాకుండా 2017 లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా బాలకృష్ణ గురువుగా కనిపించారు గోపరాజు రమణ. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో గోపరాజు రమణ పోషించిన పాత్రలు ముఖ్యమైనవి అయినా కూడా నిడివి ఎక్కువగా లేదు. కానీ మొదటి సారిగా వినోద్ అనంతోజు దర్శకత్వంలో వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో ఒక ఫుల్ లెంత్ పాత్ర పోషించారు.
ఒక వైపు కోపం, ఇంకొక వైపు ప్రేమ ఇలా అన్నీ ఎమోషన్స్ ఉన్న కొండల్ రావు పాత్రని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు గోపరాజు రమణ. ఈ సినిమాకి రివ్యూ ఇచ్చిన ప్రతి ఒక్క క్రిటిక్ గోపరాజు రమణ పర్ఫామెన్స్ ని ప్రశంసించారు.
“సినిమా రంగంలో థియేటర్ ఆర్టిస్టుల సంఖ్య కొన్ని సంవత్సరాల నుండి తగ్గిపోయింది. నా ప్రయాణం ఇదే విధంగా కొనసాగితే అది ఇంకా కొంత మంది రచయితలను, థియేటర్ ఆర్టిస్టులను ప్రోత్సహిస్తుంది” అని అన్నారు గోపరాజు రమణ.
End of Article