హైదరాబాద్ లోని ఆ 5 థియేటర్స్ సడన్ గా మూతపడడానికి కారణం ఏంటి.?

హైదరాబాద్ లోని ఆ 5 థియేటర్స్ సడన్ గా మూతపడడానికి కారణం ఏంటి.?

by Megha Varna

Ads

కరోనా కారణంగా ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. ఇప్పటికి ఇంకా కోలుకోలేని పరిస్థితి. హోటల్స్, పార్క్స్, ఫంక్షన్ హాల్స్ అన్ని ఓపెన్ అయినప్పటికీ…థియేటర్స్ మాత్రం ఇన్ని రోజులు తెరుచుకోలేదు. దీనివల్ల థియేటర్ యాజమాన్యాలు చాలానే నష్టపోయాయి. ఇప్పుడు థియేటర్స్ తెరుచుకున్నా కూడా ఆడియన్స్ ఇంతకముందులాగా వస్తారు అనే నమ్మకం లేదు.

Video Advertisement

తాజాగా 50 శాతం పరిమితితో థియేటర్స్ తెరుచుకోవచ్చు అని సీఎం కెసిఆర్ అనుమానితినిచ్చారు. ఈ క్రమంలో సినీ ప్రేమికులకు ఒక చేదు వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లగా హైదరాబాద్ లో మంచి గుర్తింపు ఉన్న అయిదు థియేటర్స్ మూతపడ్డాయి.

అవి ఏంటి అంటే…శ్రీ రామ థియేటర్(బహదూర్‌పుర), అంబ థియేటర్‌(మెహదీపట్నం), శాంతి థియేటర్‌(నారాయణగూడ), గెలాక్సీ థియేటర్‌(టోలిచౌకి), శ్రీమయూరి థియేటర్‌(ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌). ఈ అయిదు థియేటర్ లు మూతపడినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ థియేటర్స్ లో కొన్ని సంవత్సరాల నుండి ఎన్నో మంచి సినిమాలు విడుదల అయ్యాయి. మల్టీప్లెక్స్ లు వచ్చిన ఈ థియేటర్ ల క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. కానీ ఇప్పుడు పది నెలల నుండి థియేటర్ లు తెరుచుకోలేదు.

ఆదాయం లేకపోవడంతో మూసివేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు వార్త వినిపిస్తుంది. ఆ థియేటర్స్ స్థానంలో ఫంక్షన్‌ హాల్‌ నిర్మించనున్నారంట.

 


End of Article

You may also like