“ఇవాళ ఉన్నాం…రేపు ఉంటామో లేదో.?” అంటూ టెర్రరిస్ట్ ల దాడిలో చనిపోయేముందు స్నేహితుడికి జవాన్ మెసేజ్.!

“ఇవాళ ఉన్నాం…రేపు ఉంటామో లేదో.?” అంటూ టెర్రరిస్ట్ ల దాడిలో చనిపోయేముందు స్నేహితుడికి జవాన్ మెసేజ్.!

by Mohana Priya

Ads

ఒక మనిషి బతికే కాలం ఎంతో వాళ్లకి కూడా తెలియదు. అలా ఒక రోజు తన గురించి ఒక సైనికుడు తన స్నేహితుడితో మాట్లాడారు. కానీ మరుసటి రోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే. యశ్ దిగంబర్​​ దేశ్​ముఖ్ మహారాష్ట్రలోని జల్​గావ్​ జిల్లా నివాసి.

Video Advertisement

20 ఏళ్ళ వయసులో సైన్యానికి ఎంపికైన యశ్ దిగంబర్​​ దేశ్​ముఖ్ మరాఠా లైట్​ ఇన్​ఫాంట్రీ తరపున శ్రీనగర్​ లోయలో విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం రోజు యశ్​ దేశ్​ముఖ్​ తన స్నేహితుడితో మాట్లాడారు. స్నేహితుడు, యశ్​ దేశ్​ముఖ్​ ని ఎలా ఉన్నావు అని అడగగా, అందుకు సమాధానంగా యశ్​ దేశ్​ముఖ్​ “నేను బాగున్నాను. కానీ మా జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఏం చెప్పగలం. ఇవాళ ఉన్నాం.రేపు ఉంటామో లేదో” అని రిప్లై ఇచ్చారు.

మరుసటి రోజు శ్రీనగర్ లో జరిగిన టెర్రరిస్ట్ ఎదురు కాల్పుల్లో మరొక సైనికుడితో పాటు, ప్రాణాలు విడిచారు యశ్​ దేశ్​ముఖ్​. యశ్​ దేశ్​ముఖ్ తండ్రి ఒక రైతు. ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు అయ్యాయి. ఒక స్కూల్ కి వెళ్లే తమ్ముడు ఉన్నాడు. యశ్​ దేశ్​ముఖ్ కి ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనే ఆలోచన ఎప్పటినుంచో ఉండేది.

గత సంవత్సరం ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కోసం కర్ణాటక లోని బెల్గాం కి వెళ్లారు యశ్​ దేశ్​ముఖ్. ఎంతో కష్టపడి ఆర్మీ ఫిట్ నెస్ స్టాండర్డ్స్ కి సరిపోయేలా తను ఉండేలా చూసుకున్నారు. ట్రైనింగ్ అయిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ లో పోస్ట్ అయ్యారు. యశ్​ దిగంబర్​ దేశ్​ముఖ్ తన స్నేహితుడితో మాట్లాడిన ఈ సంభాషణ ప్రస్తుతం వైరల్ అవుతోంది.


End of Article

You may also like