Ads
చాలా మందికి తమ పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎంత ఇష్టం ఉంటుంది అంటే, వాళ్ళ పెంపుడు జంతువుని వాళ్ళ సొంత మనిషి లాగా చూసుకుంటారు. కొంత మందికి ఇది వినడానికి విచిత్రంగా అనిపించవచ్చు కానీ, ఇది నిజం. జంతువులు మనతో మనం మాట్లాడే భాషలో మాట్లాడలేవు. కానీ మనం చెప్పేది మాత్రం బాగా అర్థం చేసుకుంటాయి.
Video Advertisement
అందుకే మనం ఇతరులతో ఎలా అయితే కమ్యూనికేట్ చేస్తామో, అలాగే జంతువులతో కూడా కమ్యూనికేట్ చేస్తాం. వాటికి ఏదైనా అవమానం జరిగినా, ఏదైనా తక్కువ అయినా ఒప్పుకోము. ఇలాంటి సంఘటన ఒక నటికి కూడా ఎదురైంది. దాంతో కోపం తెచ్చుకున్న నటి షూటింగ్ వదిలి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే. సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన గూడచారి 116 సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు తమిళ్ స్టార్ హీరోయిన్ జయలలిత గారు. జయలలిత గారికి కుక్కలు అంటే చాలా ఇష్టం. వాటిని ఎంతో ప్రేమగా చూసుకునే జయలలిత గారు, షూటింగ్ సెట్స్ కూడా తీసుకెళ్ళేవారు. అలా గూడచారి 116 సినిమా షూటింగ్ కి కూడా తన పెంపుడు కుక్కని తీసుకెళ్లారు జయలలిత గారు.
సినిమా షూటింగ్ ఎండింగ్ కి వచ్చే సమయానికి జయలలిత గారి కుక్కకి అవమానం జరిగిందట. దాంతో జయలలిత గారు షూటింగ్ మధ్యలో నుండి వెళ్ళిపోయారు. దాంతో దర్శక నిర్మాతలు కృష్ణ గారికి, జయలలిత గారికి ఉన్న సీన్స్, క్లోజప్ షాట్స్ ముందే తీసుకొని జయలలిత గారు సినిమాకి ఇచ్చిన కాల్ షీట్స్ కంటే ముందే జయలలిత గారితో షూటింగ్ పార్ట్ పూర్తి చేశారు.
End of Article