Ads
ఎవరికైనా ఒకరికంటే ఎక్కువ మంది పార్ట్నర్స్ ఉన్నారు అంటే అందరం విచిత్రంగా చూస్తాం. కానీ అలాంటి పద్ధతి ఒకటి ఉంది. దానిని పాలియాండ్రీ అంటారు. పాలియాండ్రీ లో ఒక మహిళకి ఒకరికంటే ఎక్కువ మంది భర్తలు ఉంటారు. ఇది మనకి వినడానికి కొత్తగా అనిపించి ఉండొచ్చు. కానీ కొన్ని చోట్ల పాలియాండ్రీని పాటిస్తారు. భారతదేశంలో కూడా పాలియాండ్రీని పాటిస్తారు. వివరాల్లోకి వెళితే.
Video Advertisement
డెహ్రాడూన్ కి చెందిన రాజో వర్మ, ఐదుగురు వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు. ఆ ఐదుగురు వ్యక్తులు అన్నతమ్ముళ్లు. రాజో వర్మకి 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు గుడ్డుతో హిందు సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. తర్వాత వాళ్ల ఊరిలోని ఆచారం ప్రకారం, గుడ్డు అన్నదమ్ములైన 32 సంవత్సరాల బజ్జు, 28 సంవత్సరాల సంత్ రాం, 26 సంవత్సరాల గోపాల్, 19 సంవత్సరాల దినేష్ తో వివాహం జరిగింది.
వీరిలో దినేష్, రాజో వర్మ కంటే చిన్నవాడు. దినేష్ కి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత రాజో వర్మతో వివాహం జరిపించారు. రాజో వర్మకి ఒక బాబు ఉన్నాడు. ఈ విషయంపై రాజో వర్మ మాట్లాడుతూ ” నా తల్లి ముగ్గురు అన్నదమ్ములని పెళ్లి చేసుకున్నారు. అందుకే నాకు పెళ్లి అయినప్పుడు ఐదుగురిని నేను నా భర్తలలాగా అనుకోవాలి అని నాకు తెలుసు” అని అన్నారు.
పాలియాండ్రీకి మద్దతు ఇస్తూ ఈ వివాహాలు చేసుకున్నాను అని అన్నారు. రాజో వర్మ భర్తలు డెహ్రాడూన్ లో ఉద్యోగం చేస్తారు. రాజో వర్మ భర్త అయిన గుడ్డు మాట్లాడుతూ, ” తనకి అసూయ లాంటి భావాలు ఏమీ లేవు అని, వాళ్ళందరూ కుటుంబం లాగా ఆనందంగా ఉంటారు” అని అన్నారు.
End of Article