Ads
ప్రేమకి కులం, మతం లాంటివి మాత్రమే కాదు జెండర్ కూడా అడ్డు కాదు. కొంత మంది ఈ విషయాన్ని సమర్థిస్తూ మాట్లాడినా, మరికొంత మంది మాత్రం దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతారు. ఇటీవల ఇద్దరు యువతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే, జార్ఖండ్ లోని, కోడెర్మా జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు గత అయిదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరి వయసు 24 సంవత్సరాలు, ఇంకొకరి వయసు 20 సంవత్సరాలు.
Video Advertisement
వీరిద్దరూ నవంబర్ 8వ తేదీన పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు వాళ్ళిద్దరి ప్రేమని అంగీకరించలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత వారి ఇళ్లకి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్వారా బ్లాక్ లో వీరిద్దరూ ఉంటున్నారని తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చాలా పెద్ద గొడవ చేశారు.
ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించగా, ఆ యువతులు ఇద్దరూ మేజర్లు కాబట్టి వారు ఎటువంటి జోక్యం చేసుకోలేము అని చెప్పారు. ఈ సంఘటన చుట్టుపక్కల ఉన్న మీడియా వాళ్ళ దృష్టిలో పడటంతో, మీడియా వాళ్లు వారిద్దరూ ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్లడం మొదలు పెట్టారు. దాంతో ఆ ఇద్దరు యువతులు ఆ ప్రదేశం వదిలేసి వేరే చోటికి వెళ్లిపోయారు.
ఈ విషయంపై ఆ ఇద్దరు యువతులు మాట్లాడుతూ “దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మా కుటుంబ సభ్యులు మమ్మల్ని బెదిరిస్తున్నారు. కానీ మేము ఆ బెదిరింపులను పట్టించుకోము. మేము గత అయిదు సంవత్సరాలుగా ప్రేమించుకొని, గుడిలో పెళ్లి చేసుకున్నాం. త్వరలోనే మా పెళ్ళిని చట్టబద్ధం చేసే ప్రయత్నం చేస్తాం” అని అన్నారు.
End of Article