Ads
సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన సెలబ్రిటీలు ఎంతో మంది ఈ సంవత్సరం వివాహం చేసుకున్నారు. నిఖిల్, నితిన్, రానా, కాజల్ ఈ సంవత్సరం పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి నిహారిక కొణిదెల కూడా చేరబోతున్నారు. ఆగస్టులో నిహారికకి, చైతన్య జొన్నలగడ్డతో ఎంగేజ్మెంట్ అయింది.
Video Advertisement
చైతన్య తండ్రి ప్రభాకర్ రావు గుంటూరు రేంజ్ ఐజీ. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన చైతన్య జూబ్లీహిల్స్ లో ఉన్న భారతీయ విద్యా భవన్ లో చదువు పూర్తి చేశారు. బిట్స్ పిలానీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. హైదరాబాద్ కి చెందిన ఒక మల్టీ నేషనల్ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ గా ఉద్యోగం చేస్తున్నారు చైతన్య.
డిసెంబర్ 9 వ తేదీన ఉదయ్ పూర్ ప్యాలెస్ లో నిహారిక, చైతన్య వివాహం జరగనుంది. ఈ వేడుక ఐదు రోజుల పాటు జరగనుంది. నిహారిక ను పెళ్లి కూతుర్ని చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అల్లు ఫ్యామిలీ ఫోటోలు కూడా ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా సంగీత్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ డాన్స్ చేసారు. ఆ వీడియో వైరల్ అవుతుంది.
watch video:
also watch:
End of Article