“నువ్వు నాకు నచ్చావ్” ఎన్నో సార్లు చూసా…కానీ ఈ రెండు సీన్లలో ఆ ట్విస్ట్ గమనించలేదు.!

“నువ్వు నాకు నచ్చావ్” ఎన్నో సార్లు చూసా…కానీ ఈ రెండు సీన్లలో ఆ ట్విస్ట్ గమనించలేదు.!

by Mohana Priya

Ads

ప్రతి మనిషి పొరపాటు చేయడం అనేది సహజం. దర్శకులు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. వాటిని మనం సినిమా విడుదలైనప్పుడు అంత పట్టించుకోము కానీ, ఎప్పుడైనా తర్వాత మళ్లీ ఆ సినిమా చూసినప్పుడు “అరే ఇది పొరపాటు కదా” అని అనిపిస్తుంది. అలా నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో కూడా ఒక చిన్న పొరపాటు ఉంది. సినిమా వచ్చి 19 సంవత్సరాలయ్యింది, కానీ పైన చెప్పినట్టుగా ఎప్పుడైనా అంటే అది ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కానీ మళ్లీ సినిమా చూసినప్పుడు మాత్రమే ఇలాంటివి గమనిస్తాం.

Video Advertisement

సినిమాలో వెంకీ, వాళ్ళ నాన్న స్నేహితుడి ఇంటికి వస్తాడు. ఒకరోజు వెంకీకి వాళ్ళ నాన్న రాసిన ఉత్తరం చదివిన హీరోయిన్, ఇంకా హీరోయిన్ చెల్లెలు వెంకీ దగ్గరికి వెళ్తారు. అప్పుడు హీరోయిన్ చెల్లెలు తన పేరు పింకీ అని, తను లిటిల్ ఫ్లవర్స్ కాన్వెంట్ లో తొమ్మిదో తరగతి చదువుతోంది చెప్తుంది.

 

తర్వాత ఒక సీన్ లో పింకీ స్కూల్ కి వెళ్లడానికి బస్ స్టాప్ లో నిల్చున్నప్పుడు కొంత మంది తనని ఏడిపిస్తారు. అప్పుడు హీరో పింకీకి ధైర్యం చెప్పి వాళ్లని తిరిగి కొట్టమని చెప్తాడు. పింకీ వాళ్లలో ఒకరిని కొట్టి తర్వాత స్కూల్ బస్ వస్తే ఎక్కి వెళ్లిపోతుంది. ఇక్కడ స్కూల్ బస్ మీద ఉన్న పేరు గమనించండి. స్కూల్ బస్ మీద పేరు B.V.B.P SCHOOL అని ఉంది.

 

లిటిల్ ఫ్లవర్స్ కాన్వెంట్ ని షార్ట్ కట్ లో రాశారేమో అనుకుంటే, అక్కడ ఉన్న లెటర్స్ కూడా పేరుకి మ్యాచ్ అయ్యేలా లేవు. మనం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఈ ఒక్క సినిమా ఏంటి? ఎన్నో సినిమాల్లో ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు కనిపిస్తాయి. అయినా, ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో, ఇప్పటికి కూడా ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలుసు.

దాన్నిబట్టి ఆడియన్స్ కూడా ఇలాంటి పొరపాట్లని అంత పెద్దగా పట్టించుకోరు అని, వీటివల్ల నిజంగా సినిమాకి జరిగిన నష్టం ఏమీ లేదు అని వదిలేస్తారు అని, ముఖ్య ప్రాధాన్యత కథకి మాత్రమే ఇస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైనా కొంతకాలం తర్వాత సినిమా చూసినప్పుడు “అరే ఇది పొరపాటు కదా?” అనిపిస్తుంది అంతే.


End of Article

You may also like