వీజే చిత్ర కేసులో కొత్త ట్విస్ట్…ఆ నెంబర్ నుండి ఫోన్ కాల్ మాట్లాడి డిలీట్.? సీసీ ఫుటేజ్ మాయం.?

వీజే చిత్ర కేసులో కొత్త ట్విస్ట్…ఆ నెంబర్ నుండి ఫోన్ కాల్ మాట్లాడి డిలీట్.? సీసీ ఫుటేజ్ మాయం.?

by Mohana Priya

Ads

ఇటీవల తమిళ సీరియల్ నటి, వీజే చిత్ర అనుమానాస్పద స్థితిలో మరణించారు. చిత్ర చెన్నైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఆత్మహత్య చేసుకున్నారు అని అన్నారు. కానీ ఇది ఆత్మహత్య కాదు ఏమో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. చిత్ర తల్లి కూడా తన కూతురిని తన భర్త హేమనాథ్ రవి హింసించేవాడు అని, చిత్ర ఒంటిపై గాయాలున్నాయని,  హత్యని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, చిత్ర మరణానికి గల అసలు కారణం వెలుగులోకి రావాలి అని ఫిర్యాదు చేశారు.

Video Advertisement

ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమయం కథనం ప్రకారం సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి, చిత్ర సహ నటీనటులని, స్నేహితులని, హేమనాథ్ ని పలుమార్లు ఇంటరాగేట్ చేసి, అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత చిత్ర చనిపోవడానికి కారణం తన భర్త హేమనాథ్ అని నిర్ధారించారు. ఇప్పుడు చిత్ర మరణం కేసులో ఇంకొక విషయం వెలుగులోకి వచ్చింది. హేమనాథ్‌ తండ్రి, చిత్ర మామ అయిన రవిచంద్రన్‌ కమిషనరేట్ లో ఫిర్యాదు చేశారు.

 

సాక్షి కథనం ప్రకారం గత కొద్ది రోజుల నుంచి చిత్ర టెన్షన్ లో ఉన్నట్టు తన కొడుకు హేమనాథ్ తనకి చెప్పాడని రవిచంద్రన్ చెప్పారు. ఏదో నంబర్ నుండి కాల్ వచ్చింది అని, అప్పుడు చిత్ర దూరంగా వెళ్లి కోపంతో మాట్లాడి తర్వాత నెంబర్ డిలీట్ చేశారు అని, చిత్ర పెళ్లి చేసుకోవడం ఎవరికో ఇష్టం లేదు అని, తన కొడుకు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తనకి అనుమానాలు కలిగాయి అని అన్నారు.

తనకి ఫోన్ చేసిన వాళ్ళు ఎవరో కనుక్కొని విచారణ చేపట్టాలి అని, ఒత్తిడి వల్ల చిత్ర తల్లి విజయ ఈ విషయంపై మాట్లాడట్లేదు అని, ఈ విషయం పై పోలీసులు విచారణ చేసి తన కొడుకుని విడుదల చేయాలని రవిచంద్రన్ కోరారు. హోటల్ లోని సీసీ కెమెరా ఫుటేజ్ మాయం అవ్వడం చూస్తే అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి అని పేర్కొన్నారు.


End of Article

You may also like