Ads
సినిమా అంటే అందులో పాత్రల జీవితాన్ని చూపిస్తుంది. అంటే కొంత మంది మనుషుల జీవితాల్లో కొన్ని నెలలు, సంవత్సరాలు జరిగే కథని మూడు గంటల్లో మనకు చూపిస్తారు. సినిమాలో కాలం మారుతూ ఉంటుంది కాబట్టి కాలంతో పాటు ఆ పాత్రల స్వభావాలు, ఆలోచనలు కూడా మారుతుంటాయి. అందుకే ఏ ఉద్దేశంతో అయితే సినిమా మొదలుపెడతారో చివరికొచ్చేటప్పటికి ఆ ఉద్దేశం మారిపోవచ్చు.
Video Advertisement
దీనికి ఇప్పుడు మూడు ఉదాహరణలు చూద్దాం. మొదటిది మన్మధుడు సినిమా. ఈ సినిమా క్యాప్షన్ “హి హేట్స్ ఉమెన్”. అంటే ఆడవాళ్లు అంటే ఇష్టం ఉండదని అర్థం. హీరో, హీరోయిన్ తనని మోసం చేసి వెళ్ళిపోయింది అని అనుకొని తర్వాత నుంచి అమ్మాయిలని అసహ్యించుకోవడం మొదలు పెడతాడు. ఎవరైనా పెళ్లి చేసుకుంటే, లేదా ప్రేమలో ఉంటే కూడా వద్దు అని చెప్తాడు. కానీ చివరికి హీరో సోనాలి బింద్రేని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు.
రెండవది భీష్మ. ఇటీవలి కాలంలో థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాల్లో ఒకటి భీష్మ. ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ కామెడీ. అయితే, ఈ సినిమా క్యాప్షన్ “సింగిల్ ఫరెవర్”. క్యాప్షన్ చూస్తే హీరో సినిమా మొత్తం సింగిల్ గానే ఉంటాడేమో అని అనిపించేలా ఉంటుంది.
కానీ సినిమా మొత్తం హీరో తనకోసం ఒక గర్ల్ ఫ్రెండ్ వెతుక్కోవడం, తర్వాత కొన్ని కారణాల వల్ల హీరోయిన్ పనిచేసే కంపెనీకి సీఈఓ గా వెళ్లడం, హీరోయిన్ ని కన్విన్స్ చేయడం, అలాగే మధ్యలో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం, చివరికి హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడంతో నడుస్తుంది.
ఇంక మూడవ ఉదాహరణ ఇటీవల వచ్చిన సోలో బ్రతుకే సో బెటర్. ఈ సినిమా టీజర్ లో కూడా హీరో సోలోగా ఉండటమే బెటర్ అని చెప్తూ ఉంటాడు. కానీ ఇందులో కూడా చివరికి హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడు. ఈ సినిమా ఇటీవల విడుదలైంది. సినిమా చూసి వస్తున్న జనాల్లో కొంత మంది కూడా “సింగిల్ అని చెప్పి భలే మోసం చేశారు కదా!” అని సరదాగా అంటున్నారు. ఇందాక పైన చెప్పినట్టుగా సినిమా అంటే పాత్రల జీవితాన్ని చూపిస్తారు కాబట్టి కాలంతో పాటు వాళ్లు కూడా మారారేమో అనుకోవాలి అంతే.
End of Article