“వర్షం” సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ని గుర్తుపట్టారా.? ఇప్పుడు హీరోలా ఉన్నాడు చూడండి.!

“వర్షం” సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ని గుర్తుపట్టారా.? ఇప్పుడు హీరోలా ఉన్నాడు చూడండి.!

by Mohana Priya

Ads

చిన్నప్పుడు తమ సినిమా కెరీర్ ని మొదలు పెట్టి తరువాత యాక్టర్లుగా పరిచయమయ్యి తమకంటూ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్లలో స్టార్ హీరోలు ఉన్నారు ,ఇంకా ఎందరో క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కూడా ఉన్నారు.  ఇంక అసలు విషయానికి వస్తే వర్షం సినిమాలో ప్రభాస్ మేనల్లుడు  పాత్రలో నటించిన బాబు గుర్తుండే ఉంటాడు.

Video Advertisement

అంతకుముందే అతను సంతోషం సినిమాలో నాగార్జున కొడుకుగా కనిపించాడు. అతను ఎవరో తెలుసా? అతని పేరు అక్షయ్ బచ్చు. అక్షయ్ బాల నటుడిగా తన కెరీర్ మొదలు పెట్టాడు. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమాల్లో, సీరియల్స్ లో, ఇంకా ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ లో నటించాడు.

బ్లాక్ బస్టర్ సినిమా పోకిరి ని హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా వాంటెడ్ పేరుతో రీమేక్ చేసిన విషయం అందరికి తెలిసిందే. అందులో హీరోయిన్ అయేషా టాకియా తమ్ముడి పాత్రలో నటించాడు అక్షయ్. అక్షయ్ ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నాడు. ఆన్ మై కే రోల్ అనే ఒక కాస్టింగ్ ఏజెన్సీలో ఉద్యోగం చేస్తున్నాడు.

అక్షయ్ కి నటనతో పాటు సింగింగ్ లో కూడా ప్రావీణ్యం ఉంది.  బ్లాక్ బస్టర్ పాటలను తన వెర్షన్ లో పాడి, వీడియో రూపొందించి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తూ ఉంటాడు అక్షయ్. మిగతా చైల్డ్ ఆర్టిస్ట్స్ లాగానే అక్షయ్ కూడా మళ్లీ హీరోగా మనల్ని పలకరిస్తాడేమో, వేచి చూద్దాం.


End of Article

You may also like