Home Gallery పదేళ్ల నుండి ఈ రోజు కోసం కలలు కన్నాము.! వైరల్ అవుతున్న ప్రియాంక – మధుబాబు పెళ్లి ఫోటోలు.!

పదేళ్ల నుండి ఈ రోజు కోసం కలలు కన్నాము.! వైరల్ అవుతున్న ప్రియాంక – మధుబాబు పెళ్లి ఫోటోలు.!

by Mohana Priya

ప్రస్తుతం ఉన్న టాప్ సీరియల్స్ లో ఒకటి వదినమ్మ. ఈ సీరియల్ లో సుజిత, ప్రభాకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వదినమ్మ సీరియల్ లో మరొక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు ప్రియాంక నాయుడు. ప్రియాంక బెంగళూరు నుంచి వచ్చారు. ప్రియాంకకు చిన్నప్పటి నుంచి బేబీ షామిలి అంటే చాలా ఇష్టం. అలాగే ప్రియాంక, మెగాస్టార్ చిరంజీవికి అభిమాని. 2006 లో మిస్ బెంగళూర్ అవార్డ్ గెలుచుకున్నారు ప్రియాంక.

priyanka naidu marriage pictures

భీమిలి కబడ్డీ జట్టు కన్నడ రీమేక్ కబడ్డీ సినిమాలో నటించారు. తర్వాత ఆస్కార్ అనే సినిమా కూడా చేశారు. తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు ప్రియాంక. తెలుగులో ప్రియాంక మొదటి సినిమా కేరింత. ఈ సినిమాలో హీరోయిన్ శ్రీదివ్యకి స్నేహితురాలిగా నటించారు. తర్వాత అనగనగా ఒక దుర్గ అనే సినిమాలో నటించారు.

సినిమాలో మంచి పాత్ర కోసం ఎదురు చూస్తున్న ప్రియాంక కి ఈటీవీ వాళ్ళు సీరియల్ కోసం సంప్రదించారు. ఒక మంచి పాత్ర రావడానికి ఎంత సమయమైనా పట్టొచ్చు. మధ్యలో సమయం వృధా చేయకుండా,ఇంకా సినిమాకి, టెలివిజన్ కి పెద్దగా తేడా అనిపించకపోవడంతో, అలాగే ప్రేక్షకులకు ఇంకా చేరువ అవుతాం అన్న ఉద్దేశంతో సీరియల్స్ లో నటిద్దాం అనుకున్నారట ప్రియాంక.

ప్రస్తుతం వదినమ్మ సీరియల్ లో సిరి పాత్ర ద్వారా మనల్ని అలరిస్తున్నారు ప్రియాంక. అలాగే జెమినీ టీవీలో ప్రియాంక లీడ్ రోల్ లో నటిస్తున్న దీపారాధన సీరియల్ కూడా ఇటీవల మొదలైంది. ప్రియాంక, మంగమ్మగారి మనవడు సీరియల్ లో నటించిన మధు బాబు 10 సంవత్సరాల నుండి ప్రేమలో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఇటీవల పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి లో ప్రియాంక ఎమోషనల్ అయ్యారు. ఆ ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి ” మేము 10 సంవత్సరాల నుంచి ఈరోజు గురించి కల కన్నాం. అందుకే ఇవాళ ప్రేమ, ఎమోషన్, ఎగ్జైట్మెంట్ అన్ని కలిసి ఇలా ఆనందంతో కన్నీళ్లొచ్చాయి” అని కాప్షన్ రాశారు. ఫాలోవర్స్, అలాగే సెలబ్రిటీలు వీళ్ళిద్దరికీ కంగ్రాచ్యులేషన్స్ తెలిపారు.

#1

priyanka naidu marriage pictures#2

priyanka naidu marriage pictures#3

priyanka naidu marriage pictures#4

priyanka naidu marriage pictures#5

priyanka naidu marriage pictures#6

priyanka naidu marriage pictures#7

priyanka naidu marriage pictures#8

priyanka naidu marriage pictures

image source : instagram/actresspriyankanaidu

You may also like