Ads
గత కొంత కాలం నుండి ప్రేక్షకులు సినిమా చూసే విధానం చాలా వరకు మారింది. అంతకుముందు “సినిమా వచ్చిందా? చూశామా? హిట్టా? ఫ్లాపా?” అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అన్నిటినీ అబ్జర్వ్ చేసి కానీ ఒక సినిమా హిట్టా ఫ్లాపా అనే జడ్జిమెంట్ కి రావట్లేదు. థియేటర్లో సినిమా చూసినప్పుడు ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేయడం పక్కనపెడితే, సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ లని కూడా డీటెయిల్డ్ గా చూసి అందులో చాలా వరకూ ప్రేక్షకులు అబ్జర్వ్ చెయని కొన్ని విషయాలని చెప్తున్నారు.
Video Advertisement
అయితే ఇటీవల ఒక సినిమాకి సంబంధించి ఇలా అబ్జర్వ్ చేసిన పాయింట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా అల్లుడు అదుర్స్. నభా నటేష్, అనూ ఇమాన్యుల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా జనవరి 15 వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.
అల్లుడు అదుర్స్ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ లో హీరోతో ఒక బైక్ షాట్ ఉంటుంది. అయితే ఆ బైక్ మీద ఉన్న నంబర్ 8357 అని, టీఎస్ ఈ-చలాన్ వెబ్ సైట్ లో చూస్తే ఆ నంబర్ ఉన్న బైక్ కి ఫైన్ ఉంది అని drunkards అనే మీమ్ పేజ్ పోస్ట్ చేసింది. గత కొద్ది రోజులుగా ఈ మీమ్ ట్రెండింగ్ లో ఉంది.
కానీ ఇటీవల anna.eyy అనేే మరొక మీమ్ పేజ్, ఆ బైక్ నెంబర్ 3357 అని పోస్ట్ చేసింది. ఈ బైక్ నెంబర్ మీద చాలా చలాన్స్ ఉన్నాయి. ఈ మీమ్ కి నెటిజన్లు “నువ్వు ట్రైలర్ చూడడం గ్రేట్ కాదు బాస్. అందులో ఉన్న బైక్ నంబర్ ప్లేట్ చలాన్ చెక్ చేసావు చూడు అది గ్రేట్”, “దీనమ్మ! ఇది ఎక్కడి అబ్జర్వేషన్”, “నువ్వు మరీ ఖాళీగా ఉన్నట్టున్నావ్” అని మీమ్ టెంప్లేట్స్ తోనే కామెంట్స్ చేస్తున్నారు.
End of Article