Ads
ఒక సినిమా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే అందులో ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేసే అంశాలు అంటే మంచి పాటలు, డైలాగ్స్, స్క్రీన్ ప్లే కచ్చితంగా ఉండాలి. ఒక వేళ అవన్నీ కరెక్ట్ గా ఉంటే సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. ఒక వేళ అదే సినిమా లవ్ స్టోరీ అయితే పైన చెప్పిన వాటన్నిటితో పాటు హీరో, హీరోయిన్ పెయిర్ కూడా బాగుండాలి. దాదాపు ప్రతి సినిమాలో హీరో, హీరోయిన్ కి మధ్య ఒక లవ్ ట్రాక్ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. కానీ వాళ్ళలో కొంత మంది మాత్రం మన మైండ్ లో అలా ఉండిపోతారు. వాళ్ళని చూస్తే రియల్ లైఫ్ కపుల్ లాగానే అనిపిస్తారు.
Video Advertisement
ఒక్క మాటలో చెప్పాలంటే ఒక లవ్ స్టోరీకి హీరో, హీరోయిన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ కొన్ని సినిమాల్లో హీరో హీరోయిన్లు మాత్రమే కాకుండా వంటలు విలన్ జంటలు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. వారిలో కొంత మంది ఎవరో ఇప్పుడు చూద్దాం.
నిజం
ఈ సినిమాలో రాశి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. అప్పటివరకు అంత వైలెంట్ రోల్ రాశి చేయలేదు. ఇంకా గోపీచంద్ పర్ఫార్మెన్స్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. గోపీచంద్ కెరీర్ లో బెస్ట్ పర్ఫామెన్స్ లలో నిజం సినిమా కచ్చితంగా ఉంటుంది.
నేనే రాజు నేనే మంత్రి
ఈ సినిమాలో ప్రదీప్ రావత్ సర్పంచ్ గా నటించగా, ఆయన భార్యగా బిందు చంద్రమౌళి నటించారు.
క్రాక్
రవితేజ కం బ్యాక్ సినిమా క్రాక్ లో జయమ్మ గా వరలక్ష్మి శరత్ కుమార్, కటారి కృష్ణ గా సముద్రఖని నటించారు.
అర్జున్
ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సరిత పాత్రలను ఎవ్వరం మర్చిపోలేము.
సీమ రాజా
శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన ఈ సినిమా తెలుగులో కూడా ఇదే పేరుతో డబ్ అయింది. ఇందులో లాల్ విలన్ గా నటించగా ఆయన భార్యగా సిమ్రాన్ నటించారు. ఈ సినిమాలో సిమ్రాన్ నెగటివ్ పాత్రలో కనిపించారు.
పంచాక్షరి
ఈ సినిమాలో ప్రదీప్ రావత్ విలన్ గా నటించగా ఆయన భార్యగా జయవాణి నటించారు నటించారు.
అమ్మోరు
ఈ సినిమాలో బాబు మోహన్ గారు, వడివుక్కరసి గారు భార్యాభర్తలుగా నటించారు.
దశావతారం
కమల్ హాసన్ పోషించిన పది పాత్రల్లో ఒక విలన్ ఉంటుంది. ఆ పాత్రకి మల్లికా శెరావత్ జోడీగా నటించారు.
బిగ్ బాస్
ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు గారు, జయమాలిని గారు విలన్లు నటించారు.
End of Article