Ads
సాధారణంగా చాలా మంది నటీనటులు తమలో తమకి ఏమైనా నచ్చకపోతే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా వాటిని సరిచేయించుకోవడం జరుగుతూనే ఉంటుంది. ఎంతో మంది సెలబ్రిటీలు వాళ్ల ఫీచర్స్ కరెక్ట్ చేయించుకున్నారు. కొంత మంది వాటి గురించి బయటకు చెబితే కొంత మంది మాత్రం వాటి గురించి ఎక్కడా మాట్లాడరు. ఇలా ఒక హీరోయిన్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. కానీ తర్వాత ఫలితం వేరేగా అయ్యింది. వివరాల్లోకి వెళితే.
Video Advertisement
గావో లియు అనే ఒక చైనీస్ నటి తన ముక్కుని సరి చేయించుకోవడం కోసం సర్జరీ చేయించుకున్నారు. దక్షిణ చైనాలోని గ్వాంగ్జౌలో ఉన్న జి షీషీ గ్వాంగ్ క్లినిక్ లో కార్టిలేజ్ ద్వారా ముక్కుని రీ షేప్ చేశారు. ఈ ప్రాసెస్ అవ్వడానికి నాలుగు గంటల సమయం పట్టిందట. సర్జరీ తర్వాత గావో లియు కి ముక్కు భాగంలో దురదగా అనిపించిందట.
ఈ విషయాన్ని డాక్టర్లకి చెప్తే రెండు నెలల్లో అంతా నయమైపోతుంది అని చెప్పారు. కానీ ముక్కు కింద భాగంలో (టిప్) నల్లగా అయ్యింది. ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల చర్మ కణాలు చనిపోయాయి. దాంతో రీ షేప్ చేసిన భాగం నల్లగా కుళ్ళిపోయినట్టు అయ్యింది. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఆ హాస్పిటల్ వైద్యులకి నోస్ సర్జరీలో అనుభవం లేదట. ఈ సర్జరీ వల్ల గావో లియు దాదాపు 2.7 లక్షలు రూపాయలు కోల్పోయారు.
రెండు నెలలు అన్ని పనులు మానుకుని హాస్పిటల్లో ఉండటంతో ఉద్యోగం ఆపేయాల్సి వచ్చింది. అగ్రిమెంట్ రూల్స్ ఉల్లంఘించడంతో తాను పనిచేస్తున్న సంస్థలు మరో 20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. మళ్లీ ముక్కు సాధారణ స్థితికి రావాలి అంటే ఒక ఏడాది పడుతుంది అని డాక్టర్లు చెప్పారట. ఈ విషయాన్ని గావో లియు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి, ఇలాంటివి ఎప్పుడూ చేయించుకోవద్దు అని తన ఫాలోవర్స్ కి చెప్పారు.
End of Article