Home Filmy Adda స్టార్ హీరో కూతురుతో “విజయ్ దేవరకొండ”…ఫోటో పోస్ట్ చేసిన హీరోయిన్.! కాప్షన్ వైరల్.!

స్టార్ హీరో కూతురుతో “విజయ్ దేవరకొండ”…ఫోటో పోస్ట్ చేసిన హీరోయిన్.! కాప్షన్ వైరల్.!

by Mohana Priya

ప్రస్తుతం మన టాలీవుడ్ యంగ్ హీరోలు అనంగానే చాలా మందికి వెంటనే గుర్తొచ్చే పేరు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి లాంటి పాత్ బ్రేకింగ్ సినిమాతో ఎంతో పేరు, గుర్తింపు సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ. అంతకుముందు పెళ్లి చూపులు, ద్వారక సినిమాల్లో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి సినిమాతో ఎన్నో రోజుల వరకు డిస్కషన్ లో నిలిచారు. ఎంతో మంది ప్రముఖులు అర్జున్ రెడ్డి సినిమాని, అందులో విజయ్ పర్ఫామెన్స్ ని ప్రశంసించారు.

vijay devarakonda and sara ali khan picture going viral

ఆ తర్వాత గీత గోవిందం, టాక్సీ వాలా, నోటా, మహానటి, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు విజయ్ దేవరకొండ. అంతే కాకుండా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న లైగర్ సినిమాతో పాన్ ఇండియా హీరోల జాబితాలో కూడా అడుగుపెట్టనున్నారు. అయితే, విజయ్ దేవరకొండకి ఒక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, సౌత్ ఇండియా మొత్తంలో, అలాగే నేషనల్ వైడ్ గా కూడా ఎంతో క్రేజ్ ఉంది.

https://youtu.be/c5xKWimCyGk

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించే కాఫీ విత్ కరణ్ షో కి ఒకసారి జాన్వీ కపూర్, అర్జున్ కపూర్ గెస్ట్ లుగా వచ్చారు. అప్పుడు కరణ్ జోహార్ “మీరు ఒక మేల్ యాక్టర్ లాగా నిద్రలేవాలి అనుకుంటే, ఏ సెలబ్రిటీ గా మారుతారు?” అని జాన్వీ కపూర్ ని అడగగా అందుకు జాన్వీ “విజయ్ దేవరకొండ” అని సమాధానమిచ్చారు. అలాగే ఇంకా కొన్ని చాట్ షోస్ లో కూడా విజయ్ దేవరకొండ పేరు ప్రస్తావించారు జాన్వీ కపూర్.

ఆలియా భట్ కూడా  ఒక సందర్భంలో తనకు విజయ్ దేవరకొండ స్టైల్ చాలా ఇష్టమని చెప్పారు. వీరే కాకుండా ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు విజయ్ దేవరకొండ ని సోషల్ మీడియాలో ఫాలో అవుతారు. ఇటీవల ముంబైలో కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ఒక పార్టీకి విజయ్ దేవరకొండ వెళ్లారు.

vijay devarakonda and sara ali khan picture going viral

కొంత మంది బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆ పార్టీకి హాజరయ్యారు. వారిలో సారా అలీ ఖాన్ కూడా ఉన్నారు. సారా అలీ ఖాన్, విజయ్ దేవరకొండతో కలిసి ఒక ఫోటో దిగి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాకుండా “ఫ్యాన్ మూమెంట్” అని క్యాప్షన్ కూడా పెట్టారు. మరి వీరిద్దరూ కలిసి ఏదైనా సినిమాలో నటిస్తారా? వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోందా?  ఏమో. రావచ్చేమో. ఏదేమైనా, సారా అలీ ఖాన్. విజయ్ దేవరకొండ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

You may also like