“సాయి పల్లవి ఖాతాలో ఇంకొక 100M పాట లోడింగ్ అనుకుంటా.?” సారంగ దరియా పాటపై ట్రెండ్ అవుతున్న 23 మీమ్స్.!

“సాయి పల్లవి ఖాతాలో ఇంకొక 100M పాట లోడింగ్ అనుకుంటా.?” సారంగ దరియా పాటపై ట్రెండ్ అవుతున్న 23 మీమ్స్.!

by Mohana Priya

Ads

ఒక సినిమా హిట్ అవ్వాలంటే సినిమాలో అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్ గా ఉండాలి. కథ, పర్ఫామెన్స్, ఫైట్స్, డైలాగ్స్ తో పాటు ఒక సినిమాకి మ్యూజిక్ కూడా ఎంతో ఇంపార్టెంట్. ఏదైనా ఒక సినిమా హిట్ అయిన తర్వాత మహా అయితే కొన్ని సంవత్సరాలు మాత్రమే ఈ సినిమాని గుర్తుంచుకుంటారు. తర్వాత ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడతారు. కానీ ఆ సినిమాలో పాటలు మాత్రం ఎన్ని సంవత్సరాలు అయినా సరే వినిపిస్తూనే ఉంటాయి.

Video Advertisement

Trending memes on sai pallavi saranga dariya song

 

ఇప్పటికి కూడా ఎప్పుడో 30, 40 సంవత్సరాల క్రితం విడుదలైన సినిమాలలోని పాటలు మనం రెగ్యులర్ గా ఏదో ఒక షోలో వింటూనే ఉంటాం. అలా విన్న తర్వాత పాట ఏ సినిమాలోది అని యూట్యూబ్ లోకి వెళ్లి సర్చ్ చేసే వాళ్ళు మనలో చాలా మంది ఉంటారు. అందుకే సినిమాకి పాటలు అంత ముఖ్యం. ఇంకా పాటల పిక్చరైజేషన్, కొరియోగ్రఫీ కూడా పాట హిట్ అవ్వడానికి ఇంకొక ప్లస్ అవుతాయి. ఎన్నో సినిమాల్లో ఇలా ట్యూన్, పిక్చరైజేషన్, కొరియోగ్రఫీ అన్నీ బాగున్న పాటలు ఉంటాయి. అంతకు ముందు అంటే యూట్యూబ్ అంత పాపులర్ కాదు కాబట్టి ఆ పాటల రీచ్ ఎక్కువగా ఉండేది కాదు.

Trending memes on sai pallavi saranga dariya song

కానీ ఇప్పుడు యూట్యూబ్ ఉపయోగించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది కాబట్టి ఏదైనా ఒక ప్రాంతీయ భాషకు సంబంధించిన పాటలు కేవలం ఒక్క రీజియన్ కి మాత్రమే కాకుండా వేరే ప్రాంతాలకు కూడా రీచ్ అవుతున్నాయి. మన ఇండస్ట్రీలో కూడా ఎన్నో పాటలను ఈ ప్రపంచంలో ఉన్న ఎంతో మంది చూశారు. దానివల్ల యూట్యూబ్ లో ఆ పాటకి ఎన్నో మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

Trending memes on sai pallavi saranga dariya song

అందులో మొదటగా చెప్పుకోవాల్సింది ఫిదా సినిమాలో వచ్చిండే పాట, ఈ పాటకి 100 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎంసీఏ సినిమా లోని ఏవండోయ్ నాని గారు పాటకి కూడా 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంక రౌడీ బేబీ పాటకైతే ఏకంగా బిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇవి మాత్రమే కాకుండా బుట్ట బొమ్మ, రాములో రాముల ఇంకా ఎన్నో పాటలకి వ్యూస్ 100 మిలియన్ దాటాయి.

Trending memes on sai pallavi saranga dariya song

మొదట చెప్పిన మూడు పాటల్లో ఉన్న ఒక కామన్ పాయింట్ ఈపాటికే మీలో చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. తనే సాయి పల్లవి. సాయి పల్లవి డాన్స్ కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, ఇప్పుడు నాగచైతన్య, సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీ సినిమాలోని సారంగ దరియా పాట లిరికల్ వీడియో ఫిబ్రవరి 28వ తేదీన విడుదల అయ్యింది. ఈ సినిమాకి పవన్ సిహెచ్ సంగీతం అందించారు. పవన్ అంతకుముందు బిగిల్ ఇంకా దిల్ బేచారా సినిమాలకి రెహమాన్ తో పని చేశారు.

సారంగ దరియా పాటని మంగ్లీ పాడారు. ఈ పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. పాట చాలా క్యాచీగా ఉండటంతో, ట్యూన్ ఇంకా లిరికల్ వీడియోలో కనిపించిన స్టెప్స్ ప్రేక్షకులని ఆకర్షించాయి. అందుకే విడుదలైన కొంచంసేపటికే ఈ పాట ట్రెండింగ్ కి వచ్చేసింది. సారంగ దరియా పాట చూసిన తర్వాత ఈ పాటతో మళ్లీ యూట్యూబ్ రికార్డ్స్ బ్రేక్ అవ్వడం ఖాయం అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17

#18

#19

#20

#21

#22

#23


End of Article

You may also like