దృశ్యం 2 లో “మీనా” మేకప్ పై నెటిజెన్స్ ట్రోల్స్ … “మీనా ఒప్పుకోకపోవడం వల్లే” అంటూ డైరెక్టర్ కామెంట్స్.!

దృశ్యం 2 లో “మీనా” మేకప్ పై నెటిజెన్స్ ట్రోల్స్ … “మీనా ఒప్పుకోకపోవడం వల్లే” అంటూ డైరెక్టర్ కామెంట్స్.!

by Mohana Priya

Ads

2013లో విడుదల అయ్యి ఎంతో పెద్ద విజయం సాధించిన మలయాళం సినిమా దృశ్యం. ఈ సినిమాలో మోహన్ లాల్ హీరోగా నటించగా, మీనా హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకి జీతు జోసెఫ్ దర్శకత్వం వహించారు. దృశ్యం సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కూడా రీమేక్ అయ్యింది. తెలుగులో విక్టరీ వెంకటేష్, మీనా హీరో హీరోయిన్లుగా నటించారు.

Video Advertisement

meena trolled for her makeup in drishyam 2

అయితే, ఈ సినిమాకి సీక్వెల్ అయిన దృశ్యం 2 ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. దృశ్యం 2 సినిమాకి ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులతో పాటు, ఎంతో మంది క్రిటిక్స్ కూడా ఈ సినిమాని ప్రశంసించారు. సినిమా ఎండ్ చేసిన విధానం చూస్తే దృశ్యం కి ఇంకొక పార్ట్ కూడా ఉంది అని మనకు అర్థమైపోతుంది.

meena trolled for her makeup in drishyam 2

ఈ సినిమాని అందరూ మెచ్చుకున్నా కూడా ఒక విషయం మాత్రం కొంచెం మైనస్ పాయింట్ అని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దృశ్యం 2 సినిమాలో మీనా మేకప్ తో కనిపించారు. ఎమోషనల్ సీన్స్ లో కూడా మీనా మేకప్ తో ఉన్నారు అనే విషయాన్ని నెటిజన్లు పాయింట్ అవుట్ చేశారు. ఇదే విషయం గురించి దర్శకుడు జీతు జోసెఫ్ మాట్లాడుతూ నెటిజన్లు అన్న దానికి తను అంగీకరిస్తున్నట్లు చెప్పారు.

meena trolled for her makeup in drishyam 2

ఆయన మీనా పోషించిన రాణి పాత్ర మేకప్ లేకుండా ఉండాలి అని అనుకున్నారు. అదే విషయాన్ని మీనాకి కూడా చెప్పారట. కానీ మీనా డీ గ్లామరస్ గా కనిపించడానికి కొంచెం అసౌకర్యం వ్యక్తం చేశారట. దృశ్యం మొదటి పార్ట్ లో కూడా మీనా మేకప్ గురించి ఎంతో మంది క్రిటిసిజం వ్యక్తం చేశారట. కానీ జీతు జోసెఫ్ నటుల సౌకర్యానికి  ప్రాధాన్యత ఇస్తారు. ఒక యాక్టర్ బాగా పర్ఫార్మ్ చెయ్యాలి అంటే వాళ్ళ సౌకర్యం ఎంతో ముఖ్యమని జీతు జోసెఫ్ నమ్ముతారట.

meena trolled for her makeup in drishyam 2

అందుకే మీనా నిర్ణయానికి జీతు జోసెఫ్ అంగీకారం తెలిపినట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఈ సీక్వెల్ తెలుగులో కూడా రాబోతోంది. మలయాళంలో లాగానే తెలుగులో కూడా విక్టరీ వెంకటేష్ తో పాటు మొదటి భాగంలో ఉన్న మిగిలిన పాత్రలు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలుగు రీమేక్ సీక్వెల్ కి కూడా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తారు. షూటింగ్ మార్చ్ నుండి మొదలవ్వబోతోంది.

 


End of Article

You may also like