Ads
పశ్చిమగోదావరి జిల్లాలో ఇటీవల జరిగిన ఒక సంఘటన చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే న్యూస్ 18 తెలుగు కథనం ప్రకారం, బూబత్తుల వెంకటేశ్వరరావు, రమణ దంపతులు పశ్చిమగోదావరి జిల్లాలోని పెదవేగి మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని వీరుంపాలెంకు చెందిన వారు. వారికి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు. వారిద్దరూ రోజువారీ ఉద్యోగులు.
Video Advertisement
ఇటీవల గాలాయగూడెంలో జరిగిన శ్రీ అచ్చమ్మ తల్లి ఉత్సవాలకు వారు వెళ్లి వచ్చారు. ఉత్సవాలకి వెళ్లి వచ్చిన రెండు రోజుల తర్వాత రమణ అనారోగ్యానికి గురయ్యారు. రమణ ని ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించారు. చికిత్స జరుగుతున్నప్పుడు తొమ్మిదో తరగతి చదువుకుంటున్న వారి కూతురు 13 సంవత్సరాల శ్రావణి కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది. ఆరోగ్యం విషమించడంతో శ్రావణిని గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స చేయించారు.
చికిత్స పొందుతూ రమణ సోమవారం తెల్లవారుజామున మరణించారు. వైద్యులు కామెర్లు ఇంకా కిడ్నీ సంబంధిత కారణాలు ఆమె మరణానికి కారణం అని చెప్పారు. రమణ పార్థివ శరీరాన్ని ఇంటికి తీసుకువెళ్లి సాయంత్రం అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు వెంకటేశ్వరరావుకు గుంటూరు ఆసుపత్రిలో తన కుమార్తె వద్ద ఉన్న బంధువులు ఫోన్ చేసి శ్రావణి మరణించింది అని తెలిపారు.
భార్య పోయిన దుఃఖంలో ఉన్న వెంకటేశ్వరరావు ఈ వార్త విని చాలా బాధ పడ్డారు. బంధువులు వెంకటేశ్వరరావు ని ఓదార్చి జరగాల్సిన కార్యక్రమాలను చూసుకున్నారు. సోమవారం సాయంత్రం రమణకు అంత్యక్రియలు నిర్వహించారు. మంగళవారం ఉదయం శ్రావణికి అంత్యక్రియలు నిర్వహించారు.
End of Article