Home Filmy Adda “దీనమ్మా ఇదెక్కడి క్రియేటివిటీ రా మావా.?”…”జాతిరత్నాలు” సినిమాని ఈ 16 మీమ్స్ లో ఒక లుక్ వేయండి.!

“దీనమ్మా ఇదెక్కడి క్రియేటివిటీ రా మావా.?”…”జాతిరత్నాలు” సినిమాని ఈ 16 మీమ్స్ లో ఒక లుక్ వేయండి.!

by Mohana Priya

గత ఏడాది రావలసిన ఎన్నో సినిమాలు కరోనా కారణంగా ఆలస్యం అయ్యాయి. అలా రిలీజ్ పోస్ట్పోన్ అయ్యి ఈ ఏడాది మన ముందుకు వచ్చిన సినిమా జాతిరత్నాలు. సినిమాలో ఉన్న లీడ్ యాక్టర్స్, అలాగే సినిమా నిర్మించేది వైజయంతి మూవీస్ సంస్థ కావడంతో జాతిరత్నాలు విడుదల అయ్యే ముందు నుంచే ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులలో ఆసక్తి మొదలైంది. ఇంక టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా మీద అంచనాలు ఇంకా పెరిగాయి.

Jathi ratnalu movie in a nutshell

మార్చి 11వ తేదీన విడుదలైన జాతిరత్నాలు సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. ఈ సినిమాకి డైలాగ్స్ ఇంకా కామెడీ హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా కొత్త కొత్త ఐడియాస్ తో చాలా డిఫరెంట్ గా చేశారు. ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవ్వడంతో పాటు యూట్యూబ్ లో అలాగే సోషల్ మీడియాలో కూడా కొత్త ప్రమోషన్ కాన్సెప్ట్స్ తో ఎంటర్టైన్ చేశారు జాతిరత్నాలు సినిమా టీం.

Jathi ratnalu movie in a nutshell

అంతకుముందు విడుదలయిన రథన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన చిట్టి లిరికల్ వీడియోకి చాలా మంచి స్పందన లభించింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ఇవి కూడా ఒక ప్లస్ పాయింట్ అయ్యాయి. అల్లు అర్జున్, మహేష్ బాబు, నాని ఇంకా ఎంతో మంది ప్రముఖులు జాతిరత్నాలు సినిమాని, సినిమా బృందాన్ని అభినందించారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా చోట్ల మీమ్స్ వస్తూనే ఉన్నాయి.

Jathi ratnalu movie in a nutshell

సినిమా విడుదలయ్యాక కూడా మనకి ట్రైలర్ లో, టీజర్ లో చూపించని కొన్ని సీన్స్ గురించి సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అలా అసలు జాతిరత్నాలు సినిమా కథ మొత్తాన్ని మీమ్స్ రూపంలో చెప్తే ఎలా ఉంటుందో అనే విషయంపై ఒక మీమ్ ఆల్బమ్ ట్రెండ్ అవుతోంది. ఇంకొక విషయం ఏంటంటే సినిమాకి సంబంధించిన స్పాయిలర్స్ ఈ మీమ్స్ లో ఉంటాయి. ఒకవేళ మీరు సినిమా చూడకపోతే కొన్ని మీమ్స్ అర్థమయ్యే అవకాశం ఉండకపోవచ్చు.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15

#16

image credits: facebook/incognitotelugu

You may also like