Ads
సినిమా విడుదల అయితే ఎంత ఆలస్యం అయితే, ప్రేక్షకులలో అంత ఆసక్తి పెరుగుతుంది. ఆ క్యూరియాసిటీ నుండి కొత్త కొత్త కథలు బయటికి వస్తూ ఉంటాయి. “సినిమాలో ఇలా జరిగి ఉండొచ్చు ఏమో”, “అలా జరిగి ఉండొచ్చు ఏమో” అని కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా కామెంట్స్ లో కనిపించే చాలా విషయాలు నిజం కూడా అవుతాయి. ఇప్పటికే ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Video Advertisement
సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవ్వడంతో దేశం మొత్తం ఈ సినిమా గురించి చర్చలు ఎప్పుడో మొదలయ్యాయి. మొదటిసారిగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో ఆలియా భట్ తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెడుతున్నారు. మనం ఇప్పటి వరకు అసలు ఎప్పుడూ వినని అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కలిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా ద్వారా రాజమౌళి మనకి చూపించబోతున్నారు.
ప్రేక్షకుల క్యూరియాసిటీని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నెటిజన్ల కామెంట్లకి రిప్లై ఇస్తూ ఉంటారు. అందులో ఒకవేళ కామెంట్ సెటైరికల్ గా ఉంటే, రిప్లై కూడా సెటైరికల్ గా కూడా ఉంటుంది. ఇంక ఇటీవల విడుదలైన రామ్ చరణ్ ఇంట్రడక్షన్ వీడియో, జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ వీడియోలకి భారీ స్పందన లభించింది.
మార్చి 15 వ తేదీన ఆలియా భట్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలో సీత పాత్ర పోషిస్తున్న ఆలియా భట్ యొక్క ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్టు రెండు రోజుల ముందు సినిమా బృందం ప్రకటించింది. మార్చి 15వ తేదీన ఆలియా భట్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా భట్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
దీంతో చాలా మంది నెటిజన్లు ఆలియా భట్ ఫస్ట్ లుక్ డీకోడ్ చేయడం మొదలుపెట్టారు. ఆలియా భట్ మెడలో ఉన్న లాకెట్ అంతకుముందు రామరాజు ఇంట్రడక్షన్ వీడియోలో రామ్ చరణ్ లాకెట్ లా కనిపించింది. దాంతో ఆలియా భట్ పాత్ర, రామ్ చరణ్ పాత్రకి ఆ లాకెట్ ఇచ్చి ఉండవచ్చు అని సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి. ఈ సినిమాలో ఆలియాభట్ ఫస్ట్ లుక్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2#3#4#5#6#7#8#9 #10#11
#12
#13
#14
End of Article