ఉప్పెన “జల జల జలపాతం” కవర్ సాంగ్…చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!

ఉప్పెన “జల జల జలపాతం” కవర్ సాంగ్…చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!

by Megha Varna

Ads

విడుదల కి ముందునుంచి “ఉప్పెన” పై భారీగానే అంచనాలు ఉన్నాయి. అసలు ఈ సినిమా గతేడాదే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ, కరోనా కారణం గా వాయిదా పడింది. అయితే.. లాక్ డౌన్ టైం నుంచి ఈ సినిమా ట్రెండింగ్ లోనే ఉంది. ఎలా అంటే.. వరుస గా గ్యాప్ ఇస్తూ పాటలను విడుదల చేసారు. ఈ పాటలు బాగా ఆకట్టుకోవడం తో ఈ సినిమా పై బాగా హైప్ వచ్చింది.

Video Advertisement

దర్శకుడు సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు కావడం, మెగా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరో వైష్ణవ తేజ్, తొలి పాట తోనే కుర్రకారుని కట్టిపడేసిన హీరోయిన్ కృతి శెట్టి.. ఇలా ఈ సినిమా పై ఎక్స్ పెక్టేషన్స్ పెరగడానికి చాలానే కారణాలున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి కొంచెం హైప్ క్రియేట్ చేశాయి. సినిమాలో కూడా పాటలు అంతే బాగా పిక్చరైజ్ చేశారు. స్టొరీతో పాటు పాటలు కూడా అలా వెళ్లిపోతాయి. దేవి శ్రీ ప్రసాద్ ఉప్పెన సినిమాకి తెరవెనుక హీరో అని చెప్పొచ్చు.

“నీ కళ్ళు నీలి సముద్రం” పాటతో కృతిశెట్టి ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. సినిమా రిలీజ్ కాకుండానే ఆమెకు పలు అవకాశాలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో మరో సూపర్ హిట్ సాంగ్ “జల జల జలపాతం” పాట. సముద్రమంత ప్రేమను ఒకే పాటలో చూపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సాంగ్. అయితే ఈ సాంగ్ కవర్ వెర్షన్ ఒకటి ఆదిత్య మ్యూజిక్ వారు తాజాగా అప్లోడ్ చేసారు ఆ వీడియో ఒక లుక్ వేయండి. వీడియో కంటే కామెంట్స్ ఇంకా క్రేజీ గా ఉన్నాయి.

watch video:


End of Article

You may also like