Ads
ఏర్పేడు లో జరిగిన ఒక ఘటన చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే తెలుగు న్యూస్ 18 కథనం ప్రకారం కడప పట్టణానికి చెందిన దేవరాళ్లు సుధాకర్ కి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట కు చెందిన ధనలక్ష్మితో పరిచయం ఏర్పడింది. ధనలక్ష్మి తన పేరుని సుధాకర్ కి అనూష గా చెప్పారు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగి స్నేహంగా మారింది.
Video Advertisement
సుధాకర్ తనని నమ్ముతున్నారు అని తెలుసుకున్న అనూష సుధాకర్ కి తనకి 12 లక్షలు విలువ చేసే 500 రూపాయలు నోట్లు ఇస్తే అందుకు బదులుగా 50 లక్షల విలువ చేసే 100 నోట్లు ఇస్తానని చెప్పారు. దాంతో అనూషని నమ్మిన సుధాకర్ తన దగ్గర ఉన్న ఆస్తి తో పాటు బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి 12 లక్షల విలువచేసే 500 రూపాయల నోట్లను ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
కానీ సుధాకర్ కి అనూష పై ఎక్కడో ఒక చిన్న అనుమానం ఉండడంతో స్నేహితుడిని వెంటబెట్టుకుని మార్చి 15వ తేదీన తిరుపతి కి వెళ్లారు. అక్కడికి వెళ్లి అనుష కి కాల్ చేశారు. అనూష ఏర్పేడు వద్ద వెంకటగిరి రోడ్ లో ఉన్న లెప్రసీ హాస్పిటల్ దగ్గరికి రమ్మని చెప్పారు. సుధాకర్ తన స్నేహితుడితో కలిసి 12 లక్షల డబ్బు తీసుకొని అనూష చెప్పిన చోటికి వెళ్ళారు.
రాత్రి 8 గంటలకి అక్కడికి అనూష తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చారు.సుధాకర్ తన దగ్గర ఉన్న 12 లక్షల రూపాయలు అనూషకి ఇవ్వగా ఆ ఇద్దరు వ్యక్తులు సుధాకర్ కి రెండు చెక్క బాక్సులను ఇచ్చారు. ఒక్కొక్క బాక్స్ లో పాతిక లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పారు. అంతే కాకుండా ఒక బాక్స్ తీసి వంద నోట్ల కట్టని చూపించారు.
వారు వెళ్లిపోయిన తర్వాత సుధాకర్ రెండు బాక్సులను తెరిచి చూశారు. అందులో న్యూస్ పేపర్ బండిల్స్ దాని పై వంద రూపాయలు పేర్చి ఉన్నాయి. అనూష కి ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. దాంతో విషయం గ్రహించిన సుధాకర్ ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏర్పేడు పోలీసులు అనూష సూళ్లూరుపేట బస్టాండ్ దగ్గర ఉన్న విషయాన్ని తెలుసుకుని ఆమెను అరెస్టు చేశారు.
అనూష దగ్గర ఉన్న తొమ్మిది లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుని తిరుపతి కోర్టుకి తరలించారు. కోర్టు అనూష కి 14 రోజుల రిమాండ్ విధించింది. అనూష అంతకుముందు అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువకుడిని నమ్మించి డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు. గతంలో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయట.
End of Article