Ads
ఒక యువతి పెళ్లి చేసుకొని ఆ తర్వాత నగలు ఇంకా డబ్బులతో వెళ్ళిపోయింది. వివరాల్లోకి వెళితే వన్ ఇండియా తెలుగు కథనం ప్రకారం అంజలి అనే ఒక యువతి జునాగఢ్ పరిధిలోని అంబాలియా గ్రామానికి చెందిన ఒక యువకుడిని పెళ్లి చేసుకున్నారు. తర్వాత మూడు లక్షల వరకు డబ్బులతో అంజలి వెళ్ళిపోయారు.
Video Advertisement
దాంతో ఆ యువకుడు భరత్ మెహతా, అరుణా మెహతా దంపతుల బంధువైన వైశాలి మెహతా తనని మోసం చేసింది అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అంజలి ముఠా గురించి వెలుగులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతిగా భావిస్తున్న భాగ్‌వతి అలియాస్ అంజలి అంతకుముందు 18 పెళ్లిళ్లు చేసుకొని తర్వాత డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు.
అంజలి ఇంకా తన ముఠా కలిసి ఒక కుటుంబం దగ్గరికి వెళ్లి “తాము ఆ ఊరికి కొత్తగా వచ్చామని వివరాలు చెబుతారా?” అని పరిచయం పెంచుకొని తర్వాత వారి కూతురికి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాము అని అంజలిని ఆ పరిచయం పెంచుకున్న ఇంటికి చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేసి, శోభనం తర్వాత, కొద్ది రోజులకి అర్జంట్ అవసరం అంటూ డబ్బులు, నగలు తీసుకొని వెళ్ళిపోతారు.
జునాగఢ్ టౌన్ లోనే కొన్ని వారాల వ్యవధిలో ఇద్దరు యువకులను పెళ్లి చేసుకొని తర్వాత డబ్బులతో వెళ్ళిపోయారు అంజలి. ఇందాక చెప్పిన ఆ యువకుడు ఇచ్చిన ఫోటోలు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి వారు ఒక ఫేక్ పెళ్లిళ్ల ముఠా అని తేల్చారు.
అంజలి గుజరాత్ లోని రాజ్ కోట్ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు, అక్కడికి వెళ్లి అంజలితో పాటు ఉన్న తన తల్లి ధనుబెన్ లను పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. విచారించిన తర్వాత వారు 18 మంది యువకులను ఇలా మోసం చేసినట్లు తెలిసింది. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ప్రతి చోట వేరువేరు పేర్లతో, ఫేక్ డాక్యుమెంట్స్ తో వీళ్లు ఇలా పలువురిని మోసం చేసినట్టు పోలీసులు తెలిపారు.
End of Article