Ads
ఇండియన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా రూపొందించిన సినిమా సైనా. ఈ సినిమాలో పరిణీతి చోప్రా టైటిల్ రోల్ పోషించారు. ఈ సినిమాకి అమోల్ గుప్తే దర్శకత్వం వహించారు. సైనా సినిమా మార్చి 26వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా చూసిన వారందరూ పరిణీతి చోప్రా పెర్ఫార్మెన్స్ ని మెచ్చుకుంటున్నారు. తన రెండవ సినిమాకే నేషనల్ అవార్డ్ గెలుచుకున్నారు పరిణీతి చోప్రా.
Video Advertisement
ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఎంతో బాగా పర్ఫార్మ్ చేశారు అని అందరూ ప్రశంసిస్తున్నారు. అయితే అసలు నిజానికి సైనా సినిమాకి సైనా నెహ్వాల్ పాత్రలో ముందుగా అనుకున్నది పరిణీతి చోప్రాని కాదు. సైనా నెహ్వాల్ బయోపిక్ కి ముందుగా శ్రద్ధా కపూర్ ని హీరోయిన్ గా అనుకున్నారు. ఈ సినిమా కోసం శ్రద్ధా కపూర్ బాడ్మింటన్ నేర్చుకోవడం కూడా మొదలుపెట్టారు.
శ్రద్ధా కపూర్ ఈ సినిమా కోసం ప్రాక్టీస్ చేస్తున్న స్టిల్స్ ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో దాదాపు చాలా మంది సైనా నెహ్వాల్ పాత్రలో శ్రద్ధా కపూర్ ని ఊహించుకున్నారు. కానీ తర్వాత ఏమయిందో ఏమో తెలీదు, శ్రద్ధా కపూర్ సైనా నెహ్వాల్ బయోపిక్ నుండి తప్పుకున్నారు. అప్పుడు పరిణీతి చోప్రా సైనా నెహ్వాల్ పాత్ర చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. సినిమా విడుదల కూడా అయ్యింది.
కానీ అసలు శ్రద్ధా కపూర్ ఈ సినిమా నుండి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో ఎవరికీ తెలియలేదు. అయితే ఇండియా డాట్ కామ్ కథనం ప్రకారం ఈ విషయంపై దర్శకుడు అమోల్ గుప్తే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “మొదటిగా మేము ఈ సినిమా కోసం శ్రద్ధా కపూర్ ని అనుకున్నాం. శ్రద్ధా కూడా ఈ సినిమా కోసం చాలా వర్క్ చేశారు. ఈ పాత్ర కోసం కంప్లీట్ గా ప్రిపేర్ అయ్యారు.
అందుకే మేము షూటింగ్ కూడా మొదలు పెట్టాం. కానీ తర్వాత శ్రద్ధా కపూర్ కి అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి . శ్రద్ధా కపూర్ కి డెంగ్యూ అని తెలిసింది. ఇది స్పోర్ట్స్ కి సంబంధించిన సినిమా. శ్రద్ధా కపూర్ అనారోగ్య సమస్య తో 12 గంటల పాటు నుంచొని బ్యాడ్మింటన్ కోర్టులో ఆడటం అంటే కొంచెం ఆలోచించారు” అని చెప్పారు.
End of Article