Home Filmy Adda ఆ ఇద్దరు హీరోలు చేస్తే హిట్ అన్నారు…సేమ్ స్టోరీతో అఖిల్ సినిమా చేస్తే మాత్రం ఫ్లాప్ చేశారు.?

ఆ ఇద్దరు హీరోలు చేస్తే హిట్ అన్నారు…సేమ్ స్టోరీతో అఖిల్ సినిమా చేస్తే మాత్రం ఫ్లాప్ చేశారు.?

by Mohana Priya

ప్రతి సినిమాలోనూ కథ కొత్తగానే ఉండాల్సిన అవసరం లేదు. చాలా సినిమాల్లో కథలు సిమిలర్ గా ఉంటాయి. కానీ ప్రజెంటేషన్ డిఫరెన్స్ వల్ల ప్రేక్షకులు సినిమాని రిసీవ్ చేసుకునే విధానం మారుతుంది. దాంతో సినిమా రిజల్ట్ అనేది మారుతూ ఉంటుంది. అలా మన సినిమాల్లో ఒకే థీమ్ తో విడుదలైన మూడు సినిమాల్లో రెండు సినిమాలు హిట్ అవ్వగా ఒక సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

tholiprema mr majnu rang de similarities

వివరాల్లోకి వెళితే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా తొలిప్రేమ. 2018 లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకి ఒక మెయిన్ హైలెట్ హీరో హీరోయిన్ అయిన వరుణ్ తేజ్, రాశి ఖన్నా పెర్ఫార్మెన్స్. తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలోనే అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా మిస్టర్ మజ్ను.

tholiprema mr majnu rang de similarities

ఈ సినిమాలో పాటలు, సినిమాటోగ్రఫీ అన్నీ చాలా బాగుంటాయి. మిస్టర్ మజ్ను స్టోరీ కూడా కొంచెం తొలిప్రేమ కి సిమిలర్ గా ఉంటుంది. అంటే హీరో హీరోయిన్ ప్రేమించుకోవడం తర్వాత విడిపోవడం తర్వాత సెకండ్ హాఫ్ ఫారిన్ లో జరగడం. ఇలా అన్నమాట. అయితే ఇటీవల వెంకట్ లో దర్శకత్వంలో విడుదలైన రంగ్ దే సినిమా కూడా దాదాపు ఇదే బ్యాక్ డ్రాప్ తో నడుస్తుంది.

tholiprema mr majnu rang de similarities

నితిన్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే ఈ మూడు సినిమాల్లోనూ షేడ్స్ సిమిలర్ గా ఉంటాయి. కానీ ఈ మూడు సినిమాల్లో రెండు సినిమాలు మాత్రమే హిట్ అవ్వడం పై సోషల్ మీడియాలో ఇలా మీమ్స్ వస్తున్నాయి.

You may also like