Home Filmy Adda నెటిజన్ అడిగిన ప్రశ్నకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన “జబర్దస్త్” ఇమాన్యుల్..!

నెటిజన్ అడిగిన ప్రశ్నకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన “జబర్దస్త్” ఇమాన్యుల్..!

by Mohana Priya

ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి.ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

jabardasth Emmanuel reply to a netizen

ఒక రోజు జబర్దస్త్ లో అనసూయ యాంకర్ గా మనల్ని అలరిస్తుంటే, మరొక రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మీ యాంకర్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఇంక కమెడియన్ల విషయానికొస్తే గత కొన్ని సంవత్సరాల నుండి ఎంతోమంది కమెడియన్లు టెలివిజన్ తెరపై మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా స్థానం సంపాదించారు.

jabardasth Emmanuel reply to a netizen

ఈ మధ్య వస్తున్న దాదాపు అన్ని సినిమాల్లోనూ జబర్దస్త్ లో ఉన్న ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉంటారు. జబర్దస్త్ ద్వారా మనకి పరిచయమైన కమెడియన్ లలో మరొకరు ఇమాన్యుల్. గత కొంత కాలం నుండి ఇమాన్యుల్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని అలరిస్తున్నారు. అయితే ఇటీవల ఇమాన్యుల్ సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ చేశారు.

jabardasth Emmanuel reply to a netizen

అందులో ఒక నెటిజన్ అడిగిన ఒక ప్రశ్నకి ఇమాన్యుల్ తనదైన స్టైల్ లో సమాధానమిచ్చారు. ఆ నెటిజన్ “నీ ఫేస్ నీ అద్దంలో చూసుకున్నావా అసలు?” అని అడగగా, అందుకు ఇమాన్యుల్ పోకిరి సినిమాలో మహేష్ బాబు పిక్చర్ పోస్ట్ చేసి రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

You may also like