Home Filmy Adda అల్లు అర్జున్ “ఆర్య” హీరొయిన్ “అనురాధ మెహతా” గుర్తుందా.? ఆమె గురించి ఈ విషయాలు తెలుసా.?

అల్లు అర్జున్ “ఆర్య” హీరొయిన్ “అనురాధ మెహతా” గుర్తుందా.? ఆమె గురించి ఈ విషయాలు తెలుసా.?

by Mohana Priya

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లో ఇప్పటికి కూడా బెస్ట్ మూవీస్ లో ఒకటిగా చెప్పే సినిమా ఆర్య. 2004 లో విడుదలైన ఈ సినిమాతోనే సుకుమార్ దర్శకుడిగా మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమాని దిల్ రాజు గారు నిర్మించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అయితే ఎన్నో సంవత్సరాల వరకు అలా గుర్తుండిపోతుంది.

arya heroine anu mehta

ఆర్య సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయ్యారు అనురాధ మెహతా అలియాస్ అను మెహతా. ఈ సినిమాలో గీత పాత్ర లో తెలుగు ప్రేక్షకులని అలరించారు. ఆర్య తర్వాత 2005 లో ఈవీవీ సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన నువ్వంటే నాకిష్టం సినిమాలో హీరోయిన్ గా నటించారు అను మెహతా. ఈ సినిమాలో అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ హీరోలుగా నటించారు.

arya heroine anu mehta

ఆ తర్వాత కన్నడలో అజయ్ సినిమాలో నటించారు. కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. అజయ్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ ఒక్కడు సినిమా రీమేక్. ఆ తర్వాత తెలుగులో మహారాజశ్రీ అనే సినిమాలో, అలాగే రాజా హీరోగా వచ్చిన వేడుక అనే సినిమాలో కూడా నటించారు అను మెహతా.

arya heroine anu mehta

అను మెహతా చివరిగా 2008 లో విడుదలైన కన్నడ సినిమా హొంగనసు లో నటించారు. మళ్లీ తర్వాత అను మెహతా వేరే ఏ సినిమాలోనూ నటించలేదు. అను మెహతా సోషల్ మీడియాలో కూడా ఎక్కడా యాక్టివ్ గా లేరు. దాంతో ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. మళ్లీ ఒక మంచి రోల్ తో అను మెహతా కం బ్యాక్ ఇవ్వాలని ఆశిద్దాం.

arya heroine anu mehta

You may also like