Ads
సోషల్ మీడియా వచ్చిన తర్వాత, అది బాగా పాపులర్ అయిన తర్వాత మామూలు మనుషులకి, సెలబ్రిటీలకు మధ్య దూరం తగ్గి పోయింది అనే చెప్పాలి. ఒకవేళ ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఏదైనా ఒక ట్వీట్ పెడితే దానికి సెలబ్రిటీలు స్పందిస్తారు. అంతేకాకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ అని చాలా మంది సెలబ్రిటీలు కూడా నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు. అంతే కాకుండా ఎవరికైనా ఏదైనా సహాయం కావలసి ఉంటే సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు స్పందించి వారికి వీలైనంత సహాయం చేస్తారు.
Video Advertisement
అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో మన కేటీఆర్ ఒకరు. కేటీఆర్ ఆర్ సోషల్ మీడియా ద్వారా ఎన్నోసార్లు నెటిజన్ల తో మాట్లాడారు. అంతేకాకుండా ఎవరైనా ఏదైనా సహాయం కోసం కోరుతూ ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందులో కేటీఆర్ ని ట్యాగ్ చేస్తే కేటీఆర్ వెంటనే స్పందించి సహాయం అందిస్తారు. అంతేకాకుండా నెటిజన్లు అడిగే ప్రశ్నలకి సరదాగా సమాధానాలు ఇస్తూ ఉంటారు కేటీఆర్. అయితే ఇవాళ ట్విట్టర్లో ఒక వ్యక్తి ఇ తనకు సంబంధించిన ఒక విషయాన్ని ట్వీట్ చేసి అందులో కేటీఆర్ ని ట్యాగ్ చేశారు.
ఆ వ్యక్తి నేను చికెన్ బిర్యాని ఎక్స్ట్రా మసాలా ఇంకా లెగ్ పీస్ తో ఆర్డర్ చేశాను కానీ నాకు అది రాలేదు జనాలకి సర్వ్ చేసే విధానం ఇదేనా అని జొమాటో ని కేటీఆర్ ని ట్యాగ్ చేశారు. జొమాటో అంటే సరే కానీ కేటీఆర్ ఎందుకు ట్యాగ్ చేశారు అనే అనుమానం మనలో చాలామందికి వచ్చి ఉంటుంది. మనకి వచ్చినట్టే కేటీఆర్ కి కూడా ఇదే అనుమానం వచ్చింది. దాంతో కేటీఆర్ ఇందులో నన్ను ఎందుకు టైప్ చేసావు బ్రదర్ నేను ఏం చేయాలని అనుకుంటున్నావు అని రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్ ఇంకా ట్వీట్ కి కేటీఆర్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలా మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
End of Article