Home Filmy Adda “కారా మజాకా, ఆట” ఫేమ్ “గీతిక” రియల్ లైఫ్ లో ఇంతటి కష్టమా.? 10 సంవత్సరాల తర్వాత వీడియోతో వెలుగులోకి.!

“కారా మజాకా, ఆట” ఫేమ్ “గీతిక” రియల్ లైఫ్ లో ఇంతటి కష్టమా.? 10 సంవత్సరాల తర్వాత వీడియోతో వెలుగులోకి.!

by Mohana Priya

తెలుగు టెలివిజన్ కి రియాల్టీ షోస్ ని పరిచయం చేసిన ప్రోగ్రాం ఆట. ఈ ప్రోగ్రాంకి అప్పట్లో చాలా క్రేజ్ ఉండేది. ఆటో షో ప్రసారమయ్యే రోజులు ప్రేక్షకులు టీవీకి అతుక్కుపొయేవారు. ఆట ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలా ఆట జూనియర్స్ ప్రోగ్రాం ద్వారా పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్ గీతిక. ఆట ప్రోగ్రాం తరచుగా ఫాలో అయ్యే వారికి గీతిక కచ్చితంగా గుర్తుండే ఉంటుంది.

Aata juniors contestant Geethika

అంత చిన్న వయసులోనే తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల నుండి, జడ్జెస్ నుండి ఎన్నో ప్రశంసలు అందుకుంది గీతిక. అయితే, ఆట తర్వాత గీతిక కారా మజాకా అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. దాంతో గీతికపై పుకార్లు రావడం మొదలయ్యాయి. తన పరిస్థితి బాలేదు అని, ఇంకా ఏవేవో కల్పిత విషయాలతో ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ గీతిక మీడియా ముందుకు వచ్చి వీటి గురించి స్పందించింది.

Aata juniors contestant Geethika

తన గురించి వస్తున్న పుకార్లపై గీతిక మాట్లాడుతూ 2012 లో ఒక ఈవెంట్ కి వెళ్లి వస్తూ ఉంటే ఒక రోడ్ ప్రమాదం జరిగింది అని, అందులో తన ఎడమ కాలు చెయ్యి విరిగిపోయాయి అని తన తండ్రికి కూడా గాయాలయ్యాయని చెప్పింది. ఆ తరువాత కోలుకోవడానికి కొంత సమయం పట్టింది అని, ఆ తర్వాత ఒక సినిమా, సీరియల్స్ లో నటించినా కానీ అంత పెద్ద గుర్తింపు రాలేదు అని ఉద్యోగ రీత్యా తన తల్లిదండ్రులు దుబాయ్ కి వెళ్లి పోయారు అని, గీతిక తన తాతయ్య అమ్మమ్మ దగ్గర ఉంది అని తెలిపింది.

Aata juniors contestant Geethika

వారికి షూటింగులకి తీసుకువెళ్లడం కష్టమవడంతో గీతిక కొంత విరామం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పింది. ప్రస్తుతం గీతిక ఇంటర్ సెకండియర్ చదువుతోంది. తను డాన్స్ ని అసలు మర్చిపోలేదు అ,ని వచ్చే సంవత్సరం నుండి కెరియర్ పరంగా కూడా ఆలోచిస్తాను అని, అవకాశాలు వస్తే ఖచ్చితంగా చేస్తాను అని చెప్పింది గీతిక. గీతికకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో తన డాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.

watch video :

 

You may also like