Home News భర్తను వదిలేసి…ట్రైన్ ఎక్కి టాయిలెట్ పక్కన మరో వ్యక్తితో పెళ్లి.! అసలేమైంది.?

భర్తను వదిలేసి…ట్రైన్ ఎక్కి టాయిలెట్ పక్కన మరో వ్యక్తితో పెళ్లి.! అసలేమైంది.?

by Mohana Priya

ఒక వ్యక్తి, ఒక పెళ్ళైన మహిళ మెడలో తాళి కట్టాడు. అది కూడా ట్రైన్ లో. వివరాల్లోకి వెళితే, బీహార్ లోని, సుల్తాన్ గంజ్ లోని, భీర్ ఖుర్ద్ గ్రామానికి చెందిన అషు కుమార్ అనే వ్యక్తి, అను కుమారి అనే ఒక మహిళని ప్రేమించారు. అయితే, అను కుమారికి రెండు నెలల క్రితం ఆమె కుటుంబం బలవంతంగా పెళ్లి చేసింది. బలవంతంగా, తన ఇష్టం లేకుండా జరిగిన పెళ్లి కావడంతో అను కుమారి తన భర్తను అంగీకరించలేకపోయారు.

Couple married in a train

ఈ క్రమంలో అషు కుమార్ ని కలిసేందుకు అను కుమారి ప్లాన్ చేశారు. బుధవారం తన భర్త ఇంటి నుంచి బయటికి వచ్చి, సుల్తాన్ గంజ్ రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు. అక్కడినుంచి అషు కుమార్, అను కుమారి కలిసి బెంగళూరు వెళ్లే రైలు ఎక్కారు. ఆ ట్రైన్ లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

Couple married in a train

ఈ విషయం గురించి అను కుమారి మాట్లాడుతూ “నా ప్రేమ గురించి తెలిసిన కుటుంబ సభ్యులు నన్ను హెచ్చరించారు. బయటికి వెళ్లకుండా నన్ను ఇంట్లోనే నిర్బంధించారు. ఈ ఏడాది ఏప్రిల్ లో కిరణ్ పూర్ గ్రామానికి చెందిన వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేశారు. నేను నా భర్తని తిరస్కరించాను” అని చెప్పారు.

Couple married in a train

అషు కుమార్ మాట్లాడుతూ “అను కుమారి  ట్రైన్ ఎక్కిన తరువాత తన మెడలో తాళి కట్టాల్సిందిగా  ఒత్తిడి తీసుకువచ్చింది. దాంతో ట్రైన్ లో టాయిలెట్ ముందు నిలబడి ఆమె నుదుటిపై బొట్టు పెట్టాను. ఆ తర్వాత మెడలో తాళి కట్టాను” అని చెప్పారు.

You may also like