Ads
ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ గారు రాజకీయాల్లోకి వస్తున్నాను అని అనౌన్స్ చేసిన విషయం మన అందరికి తెలిసిందే. కొంత కాలం క్రితం అనారోగ్య సమస్యల కారణంగా హాస్పిటల్ లో చేరిన రజినీకాంత్ గారు తన రాజకీయాలకు సంబంధించిన పనులను వాయిదా వేశారు. అయితే రజినీకాంత్ గారి భవిష్యత్తు రాజకీయాలు ప్రణాళిక గురించి ఇప్పటివరకు ఎవరికి స్పష్టంగా తెలియదు.
Video Advertisement
కానీ ఇవాళ రజినీకాంత్ గారు తాను రాజకీయాల నుండి దూరమవుతున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా రజినీకాంత్ గారు ఒక ప్రెస్ నోట్ విడుదల చేసారు. అందులో రజినీకాంత్ గారు తనకి భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు అని, అందుకే తను రజినీ మక్కల్ మండ్రం ని ఆపేయాలి అనుకుంటున్నాను అని తెలిపారు.
అందులో ఉన్న సభ్యులు రజినీకాంత్ ఫ్యాన్ క్లబ్ అసోసియేషన్ లో భాగవతారు అని ఆ అసోసియేషన్ ద్వారా ప్రజలకు సేవ చేస్తారు అని తెలిపారు. రజినీకాంత్ గారు ఇవాళ విడుదల చేసిన ఈ ప్రెస్ నోట్ అందరినీ షాక్ కి గురి చేసింది. ప్రస్తుతం రజనీకాంత్ గారు అన్నాత్తే డబ్బింగ్ పనిలో బిజీగా ఉన్నారు.
End of Article