Ads
గడిచిన కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణ జలాల సమస్య తెలిసిందే. కృష్ణ జలాలని ఆంధ్రా అక్రమంగా వాడుకుంటుందని తెలంగాణ ప్రభత్వం ఆరోపిస్తూ ఉంటే, తమ వాటా ప్రకారమే తాము వాడుకుంటున్నామని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంది. ఈ సమస్యపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ఎన్నికల ముందు కలిసి పని చేసిన ఇద్దరు సీఎంలు ఈ సమస్య పై కూర్చుని పరిష్కారించుకునే ప్రయత్నం ఎందుకు చెయ్యడం లేదంటూ సూటిగా ప్రశ్నించారు
Video Advertisement
.కరోనా కాలం లో పార్టీ లో చనిపోయిన కార్యకర్తలని పరామర్శిచారు చంద్రబాబు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన చంద్రబాబు నడకుదిటి నర్సింహారావు వారి కుటుంబ సబ్యులని కలుసుకొని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసారు. కరోనా కట్టడిలో ప్రబుత్వం పూర్తిగా విఫలమైందని తమ ప్రభుత్వం ఉంటే ఇంకా మెరుగ్గా పనిచేసేదని చెప్పుకొచ్చారు. ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళి అయిందని చివరికి చెత్త మీద కూడా పన్ను విధించే చెత్త ప్రభుత్వం ఇదేనని ఆయన విమర్శిచారు. రైతుల వద్ద పంటని కొన్న సర్కార్ వాటికి తిరిగి డబులు చెల్లిచట్లేదని విమర్శించారు. తిరిగి డబ్బులు అడిగితే రైతుల మీదే కేసులు పెడుతున్నారని చెప్పారు.
End of Article