Ads
2000 సమయంలో విడుదలయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిన పాటల్లో ఒక పాట దేవుడు వరమందిస్తే. ఈ పాట మనలో చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఈ పాటతో పాటు ఇందులో నటించిన నటీనటులు కూడా మన అందరికీ గుర్తుండే ఉంటారు. ఈ పాట సిక్స్టీన్స్ సినిమాలోనిది. ఇందులో రోహిత్, రితిక హీరో హీరోయిన్లుగా నటించారు.
Video Advertisement
రోహిత్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో చాలా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమాతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇంకా చేరువయ్యారు. ఇవి మాత్రమే కాకుండా నేను సీతామాలక్ష్మి, సొంతం, శంకర్ దాదా ఎంబిబిఎస్ తో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో నటించారు.
ఆ తర్వాత తరుణ్, ఆకాష్ హీరోలుగా నటించిన నవ వసంతం సినిమాలో కూడా మరొక హీరోగా నటించారు రోహిత్. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించలేదు. 2013లో హాట్ బాయిల్ అనే సినిమాలో నటించారు. రోహిత్ మధ్యలో కొన్ని సినిమాల్లో నటించినా కూడా అవి ఏవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. రోహిత్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో ఎవరికీ అంత పెద్దగా తెలియదు.
అయితే రోహిత్ ప్రజెంట్ లుక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్ హీరోగా నటించిన కళాకార్ అనే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయ్యింది. ఈ పోస్టర్ ని హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో రోహిత్ చాలా డిఫరెంట్ గా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
watch video :
End of Article