Home Viral పోలీస్ ఆఫీసర్ అని పరిచయం చేసుకుంది…చివరికి ఏమైందంటే.?

పోలీస్ ఆఫీసర్ అని పరిచయం చేసుకుంది…చివరికి ఏమైందంటే.?

by Mohana Priya

తాము పోలీసులమని మోసం చేసే వారి గురించి మనం తరచుగా చూస్తూనే ఉంటాం. ఇటీవల ఒక మహిళ కూడా ఇలాగే పోలీస్ అని చెప్పి అందరినీ మోసం చేసింది. వివరాల్లోకి వెళితే జాదవ్ పూర్ లోని, బిక్రం ఘర్ కి చెందిన ఒక యువతి సులగ్న ఘోష్ అనే ఒక యువతి తాను కోల్కతా ట్రాఫిక్ పోలీస్ అని చెప్పింది. సులగ్న వైట్ కలర్ కోల్కతా పోలీస్ యూనిఫాం వేసుకుని దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Women in Kolkata fakes herself as a police officer

అంతే కాకుండా కోల్కతా పోలీస్ కమిషనర్ అయిన సౌమెన్ మిత్రా తన తండ్రి అని చెప్పుకుంది. ఆ తర్వాత ఆ ఫోటోలను సోషల్ మీడియా నుండి తొలగించింది. ఇది చూసిన ఒక వ్యక్తి అనుమానం వచ్చి కోల్కతా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తర్వాత సులగ్న తప్పుడు ప్రచారం చేస్తోంది అని తనపై కేసు నమోదు అయ్యింది.

Women in Kolkata fakes herself as a police officer

image source : News Front

ఈ విషయంపై సులగ్న మాట్లాడుతూ తాను పోలీస్ యూనిఫాం, యూట్యూబ్ లో ఒక వీడియో చేయడానికి తీసుకున్నాను అని చెప్పింది.  కానీ ఇప్పటి వరకు సులగ్న ఎవరిని మోసం చేసినట్లు ఆధారాలు లేవు అని పోలీసులు చెబుతున్నారు. ఆమె పై ఎలాంటి ఆరోపణలు రాలేదు అని అన్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Women in Kolkata fakes herself as a police officer

అయితే, అసలు సులగ్న ఆ పోలీసు దుస్తులను ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? ఎవరు అద్దెకు ఇచ్చారు? అనే విషయంపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అంతే కాకుండా పోలీసులు సులగ్న తల్లిదండ్రులను పిలిచి వారిని హెచ్చరించారు. అలాగే సులగ్న కి కౌన్సిలింగ్ అవసరం అని చెప్పారు. అంతే కాకుండా తాను భవిష్యత్తులో ఇలాంటి పనులు ఏమీ చేయను అని సులగ్న చేత బాండ్ రాయించుకున్నారు.

You may also like