Home Filmy Adda “నువ్వు నాకు నచ్చావ్” చాలా సార్లు చూసి ఉంటారు…కానీ ఈ విషయాన్ని ఎప్పుడైనా గమనించారా..?

“నువ్వు నాకు నచ్చావ్” చాలా సార్లు చూసి ఉంటారు…కానీ ఈ విషయాన్ని ఎప్పుడైనా గమనించారా..?

by Mohana Priya

మనం ఏదైనా సినిమా ఒకసారి చూసినప్పుడు చాలా విషయాలను గమనించము. తర్వాత రెండవ సారి లేదా మూడవ సారి చూసినప్పుడు లేదా అంతకంటే ఎక్కువసార్లు చూసినపుడు కొన్ని విషయాలను మనం గమనిస్తాం. అలా చాలా సినిమాలకు జరుగుతాయి. అలా మనం తర్వాత ఎప్పుడైనా సినిమా చూసినప్పుడు అందులో ఉన్న మిస్టేక్స్ కానీ, లేదా అప్పటి వరకు మనం గమనించని విషయాలను కానీ చూస్తాము.

అలాంటి విషయం ఒకటి ఇటీవల బయటికి వచ్చింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమా చూడని తెలుగు వారు ఉండరు ఏమో. సినిమా విడుదల అయినప్పుడు రిపీటెడ్ గా చూసిన ఆడియన్స్ ఉండే ఉంటారు. ఆ తర్వాత టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు అలాగే యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పుడు కూడా ఈ సినిమాని రిపీటెడ్ గా ఎంతోమంది చూస్తూ ఉంటారు.

Nuvvu naaku nachav movie unnoticed detail

ఇప్పుడు కూడా ఈ సినిమా టీవీలో వేసిన ప్రతిసారి మంచి టీఆర్పీ వస్తుంది. సినిమా క్రేజ్ అలాంటిది మరి. అందులోనూ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం గారితో వచ్చే సీన్స్ అయితే సినిమాకి ఒక హైలైట్. హీరో, హీరోయిన్, పింకీ బయటికి వెళుతూ ఉంటే వారి కార్ ఆపి దారిలో లిఫ్ట్ అడిగి వాళ్లతో పాటు వెళ్లే వ్యక్తిగా బ్రహ్మానందం కనిపిస్తారు.

Nuvvu naaku nachav movie unnoticed detail

అయితే ఈ సినిమాలో మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా. ఈ సినిమాలో బ్రహ్మానందం గారి పాత్రకి పేరు లేదు. అవును నిజమే. ఈ సినిమాలో బ్రహ్మానందం గారి పాత్రకి పేరు లేదు. వికీపీడియాలో కూడా బ్రహ్మానందం గారి పాత్ర ఫోటోగ్రాఫర్ అని ఉంటుంది అంతే. ఇప్పటి వరకు మీరు ఈ విషయాన్ని గమనించకపోయినట్లయితే ఇప్పుడు మళ్లీ ఒకసారి సినిమా చూసినప్పుడు ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయండి.

You may also like